రెండేళ్లు వెనక్కి వెళ్తే అప్పుడు నాగార్జున పరిస్థితి వేరు. మిగతా సీనియర్ హీరోల్లాగే ఆయన కూడా రేసులో వెనకబడిపోయాడు. ముఖ్యంగా ‘భాయ్’ సినిమాతో నాగ్ బాగా దెబ్బ తిన్నాడు. దీంతో ఇక నాగ్ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ రెండేళ్ల కిందట ‘మనం’ లాంటి మంచి సినిమాతో మళ్లీ తన ఉనికిని చాటుకున్న నాగ్.. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’తో తన బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపించాడు. నాగ్ ఈ వయసులో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టడం అన్నది మామూలు విషయం కాదు. ఈ సినిమా తర్వాత నాగ్ మీద ఇండస్ట్రీలో అంచనాలు బాగా పెరిగిపోయాయి. దీనికి తోడు ‘ఊపిరి’ టీజర్ చాలా ప్లెజెంట్ గా ఉండటంతో ఆ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు - తమిళ భాషల్లో మార్చి 25న భారీ అంచనాల మధ్య సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ఐతే నాగ్ సినిమా వస్తున్న సంగతి తెలిసి కూడా రెండు రోజుల ముందు తన సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడు సందీప్ కిషన్. సందీప్ చివరి సినిమా ‘టైగర్’ బాగానే ఆడింది కానీ.. అతడికి హీరోగా ఓ ఇమేజ్ అంటూ లేకపోవడంతో ‘రన్’ మీద అంచనాలు మరీ ఎక్కువేమీ లేవు. ‘రన్’ టీజర్ - ట్రైలర్ - ప్రోమోస్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పైగా ఇది ‘నేరం’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్. కాబట్టి ఇది మినిమం గ్యారెంటీ మూవీ అనే అనిపిస్తోంది. కానీ ‘ఊపిరి’తో పోటీ పడుతుండటమే కొంచెం ఆందోళన కలిగించే విషయం. అలాగని దీని రిలీజ్ డేట్ ముందేమీ ఫిక్స్ కాలేదు. నాగ్ మూవీ డేట్ కన్ఫమ్ అయ్యాకే వీళ్లూ విడుదల తేదీ ప్రకటించారు. అంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఐతే ‘ఊపిరి’ అంచనాలకు తగ్గ సినిమానే అయి ఉంటే, దానికి మంచి టాక్ వచ్చిందంటే దాని ముందు ‘రన్’ నిలుస్తుందా లేదా అన్నదే చూడాలి.