రష్యాలో దుమ్మురేపుతున్న బాహుబలి-2.. నయా రికార్డు!

Update: 2020-05-28 17:30 GMT
డార్లింగ్ ప్రభాస్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' భారీ సినిమా సిరీస్ తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బాహుబలి- ది కన్‌క్లూజన్' భాగం అయితే బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులు అన్నింటిని బద్దలుకొట్టింది. ఆల్‌టైమ్ టాప్ ఇండియన్ మూవీస్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను సాధించింది. ఎప్పటికి భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి-2 సినిమా రష్యా దేశంలోనూ ఇరగదీస్తోంది. అయితే అది థియోటర్లో కాదు.. ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్‌లో టెలికాస్ట్ అవుతుంది. గురువారం రష్యన్ ఫెడరేషన్ ఎంబసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌'కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి.. రష్యాలో ఒక టీవీ చానల్‌లో ఆ మూవీ ప్రసారమవుతోందని తెలిపింది.

రష్యన్ భాషలో డబ్ చేసిన వెర్షన్ టెలీకాస్ట్ అవుతోందని చెప్తూ.. ఆ వీడియోను షేర్ చేశారు. "రష్యాలో ఇండియన్ సినిమా పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఇప్పుడు రష్యన్ టీవీ ప్రసారం చేస్తోంది ఏమిటో తెలుసా.. రష్యన్ వాయిస్ ఓవర్‌తో 'బాహుబలి' మూవీ" అని వారు పోస్ట్ చేశారు. రష్యన్ ఎంబసీ ఆ వీడియోను షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. బాహుబలి సిరీస్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ఒక ఇండియన్‌ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇది నిజంగా భారతీయులకు గర్వకారణమంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. రష్యన్ ప్రేక్షకులు మన బాహుబలి సినిమాను ఆదరించడం.. మాకు చాలా సంతోషంగా ఉందంటూ 'బాహుబలి' ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News