`ఆర్ ఎక్స్ 100` దూకుడు త‌గ్గ‌ట్లేదుగా!

Update: 2018-07-19 08:42 GMT
టాలీవుడ్ లో గ‌త ఏడాది విడుద‌లైన `అర్జున్ రెడ్డి` త‌ర‌హాలో తాజాగా విడుద‌లైన `ఆర్ ఎక్స్ 100`కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. `అర్జున్ రెడ్డి`త‌ర్వాత ఆ త‌ర‌హాలో హైప్ తెచ్చుకున్న `ఆర్ ఎక్స్ 100` బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల‌ను కురిపిస్తోంది. కార్తికేయ‌ - పాయ‌ల్ రాజ్ పుత్ వంటి డెబ్యుటెంట్ల‌తో ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి....ఎంచుకున్న బోల్డ్ క‌థ‌...ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది. వ‌ర్మ శిష్యుడు అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన ఈ క‌ల్ట్ క్లాసిక్ మూవీ..... రెండు తెలుగు రాష్ట్రాల‌లో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాకు పెద్ద‌గా బ‌జ్ లేదు. తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం విడుద‌లైన రెండు రోజుల్లోనే నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. మొద‌టి వారంలో ఈ సినిమా మొత్తంగా రూ.7.53 కోట్లు(షేర్) వ‌సూలు చేసి...నిర్మాత‌ల‌కు - డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు  లాభాలు తెచ్చిపెట్టింది. అన్ని ఖ‌ర్చులు క‌లుపుకొని 2.5 కోట్ల‌తో నిర్మించిన‌ ఈ చిత్రం....థియాట్రిక‌ల్ ర‌న్ లో 10 కోట్లకు మించి వ‌సూలు చేయ‌వ‌చ్చ‌ని ట్రేడ్ విశ్లేష‌కుల అంచ‌నా.

ఆర్ ఎక్స్ నైజాం&ఆంధ్ర 7వ రోజు షేర్

నైజాం- 33.66 ల‌క్ష‌లు
సీడెడ్ -7.62 ల‌క్ష‌లు
వైజాగ్- 6.43 ల‌క్ష‌లు
ఈస్ట్ - 3.71 ల‌క్ష‌లు
వెస్ట్ - 3.90 ల‌క్ష‌లు
కృష్ణా - 3.61 ల‌క్ష‌లు
గుంటూర్ - 3.48 ల‌క్ష‌లు
నెల్లూర్ -1.73 ల‌క్ష‌లు

7వ రోజు మొత్తం షేర్ - 64.14 ల‌క్ష‌లు

మొత్తం మొద‌టి వారం షేర్ - 7.53 కోట్లు

Tags:    

Similar News