నిర్మాత పంట పండటమంటే ఇదేనేమో. తొలి వీకెండ్ ముగిసేలోపే పెట్టిన డబ్బుకి రెండింతల లాబాలు. పెద్ద హిట్టు అనే మాటని ఇక్కడ కచ్చితంగా వాడొచ్చు. లాభాల మాట దేవుడెరుగు, అసలిప్పుడు చిన్న సినిమా తీస్తే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగొస్తుందో రాదో అనే పరిస్థితి. కానీ కొత్త నటీనటులతో - కొత్త దర్శకుడు తెరకెక్కించిన `ఆర్.ఎక్స్.100` మాత్రం బాక్సాఫీసు దగ్గర అదరగొడుతోంది. తొలి వీకెండ్ ముగిసేలోపే 5.20 కోట్లు షేర్ సాధించింది. ఈ సినిమాని 2 కోట్లతో తీశారు. అంటే ఇప్పటికే 3.20 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది.
ఒక చిన్న సినిమా ఈ రేంజ్‌లో సక్సెస్ సాధించడం ఈ యేడాదిలో ఇదే తొలిసారి. రాబోయే చిన్న సినిమాలకి - చిన్న సినిమాలు తీయాలనుకొంటున్న ఔత్సాహికులకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుండనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా యువతరం ఈ సినిమాని బాగా ఆస్వాదిస్తోంది. దర్శకుడు యూత్ కంటెంట్‌తో సినిమాని తీయడం... మంచి ట్రైలర్ తో విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాకి శాటిలైట్ హక్కులు - ఓవర్సీస్ వసూళ్ల రూపేణా మరింతగా కాసుల వర్షం కురవబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రంతో నాయకానాయికలు - దర్శకులకి మంచి బేస్ ఏర్పడినట్టైంది.