విపరీతమైన పోటీ ఉన్న ఇప్పటి ట్రెండ్ లో ప్రేక్షకులను థియేటర్ దాకా రప్పించడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే నవతరం దర్శకులతో పాటు సీనియర్లు కూడా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. మొన్న ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం అందులో కంటెంట్ అయితే అంత కన్నా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది మాత్రం టైటిలే. అందుకే కొత్త డైరెక్టర్స్ అదే పంధాలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్ భూపతి తన సినిమాకు RX 100 అనే టైటిల్ ఫిక్స్ చేయటం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నెలకో కొత్త బైక్ మార్కెట్ లో వస్తున్న ఇప్పటి యూత్ కి ఇదొక పాత బైక్ మోడల్ నెంబర్ అనే విషయం అవగాహన ఉండకపోవచ్చు.
90 దశకంలో టూ వీలర్స్ వాడినవాళ్ళకు అందులోనూ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ బైక్ యమహా కంపెనీ రూపొందించిన RX 100. ఎవరి దగ్గరైనా ఈ బైక్ ఉందంటే దాన్నొక స్టేటస్ సింబల్ గా కూడా భావించేవాళ్ళు. 100 సిసి ఇంజిన్ ఉండటం వల్ల దానికి ఆ పేరు ఉండేది. అప్పట్లో కాలేజీ స్టూడెంట్స్ - యూత్ దీన్ని విస్తృతంగా వాడారు. ఇప్పటికీ కొందరు అపురూపంగా అప్పుడెప్పుడో కొన్న ఈ మోడల్ ను వింటేజ్ మెమరీగా ఇంకా వాడుతూ భద్రపరుచుకున్నవారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వర్మ శిష్యుడు తీసుకున్న కథాంశం బహుశా ఆ నేపధ్యానిది అయ్యుండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ లో ఏది రివీల్ చేయకుండా ఏరియల్ షాట్ లో బైక్ ని మాత్రమే ఫోకస్ చేస్తూ డిజైన్ చేయటం కొత్తగా ఉంది.
కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో తమిళ్ సీనియర్ హీరో రాంకీ కూడా ఉన్నాడు. 90ల టైంలో సింధూర పువ్వు లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా రాంకీ మనకు పరిచయమే. ఒసేయ్ రాములమ్మలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రావు రమేష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్ కు నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ కెఎల్ ప్రవీణ్ దీంతోనే పరిచయమవుతున్నారు. రజని కబాలి సినిమాకు వర్క్ చేసింది ఈయనే. ఎమోషనల్ లవ్ స్టొరీ అని చెబుతున్న నిర్మాతలు సమ్మర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.