ఆర్‌ఎక్స్ 100 సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరును దక్కించుకోవడం తో పాటు కమర్షియల్ గా మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆయన సినిమాలు ఒకటి రెండు నిరాశ పర్చిన కొన్ని సక్సెస్ అయ్యాయి. ఓవరాల్ గా కార్తికేయ సినిమా కెరీర్ అలా అలా సాగుతూ వెళ్తోంది. హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఈయన నటించిన విషయం తెల్సిందే.
ఇటీవలే తమిళ చిత్రం వాలిమై లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ సినిమా మాత్రమే కాకుండా తమిళంలో మరికొన్ని సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో కూడా సక్సెస్.. ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను కార్తికేయ చేస్తున్నాడు. హీరో ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సమాచారం అందుతోంది.
హిందీలో ఈమద్య కాలంలో తెలుగు హీరోలు సందడి చేస్తున్నారు. వరుసగా తెలుగు సినిమా లు ఉత్తర భారతంలో ఆకట్టుకుంటున్నాయి. కనుక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వరుసగా యంగ్ హీరోలు కూడా బాలీవుడ్ కు క్యూ కడుతున్నారు.
అందులో భాగంగానే కార్తికేయ కూడా తన తెలుగు సినిమాలతో ఉత్తర భారతంలోని శాటిలైట్ ప్రేక్షకుల పై దృష్టి పెట్టాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
కార్తికేయ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా లను మాత్రమే కాకుండా గతంలో విడుదల అయిన సినిమాలను కూడా హిందీలో డబ్ చేసి ఆన్ లైన్ ద్వారా లేదా శాటిలైట్ ద్వారా అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్తికేయ లుక్ తో పాటు ఆయన సినిమాలన్నీ కూడా మాస్ గా ఉంటాయి. ఈమద్య కాలంలో ఉత్తరాది ప్రేక్షకులు మాస్ సినిమాలను బాగా ఆధరిస్తున్నారు.
రెగ్యులర్ ఫార్మట్ కు దూరంగా విభిన్నమైన సినిమాలను చూడాలని హిందీ ప్రేక్షకులు కోరుకుంటున్నారని పుష్ప మరియు కేజీఎఫ్ 2 సినిమా ల సక్సెస్ తో వెళ్లడి అయ్యింది. అందుకే కార్తికేయ కూడా తన మాస్ సినిమాలను అక్కడ చూపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే హిందీలో కార్తికేయ సందడి చేయడం ఖాయం అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.