గత నెలరోజులుగా ప్రేక్షకులందరి ఫోకస్ 'సాహో' చిత్రం పైనే ఉంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని అటు నిర్మాతలు.. ఇటు హీరో ప్రభాస్ తో పాటుగా దర్శకుడు సుజీత్ కూడా టెన్షన్ పడి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 'సాహో' ప్రమోషన్స్ సమయంలో ఒకటీ అరా సందర్భాలలో మీడియా ముందుకు వచ్చాడు కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం సుజిత్ పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నాడు. సినిమా రిలీజ్ తర్వాత సుజిత్ గోవాకు వెళ్ళాడని కూడా టాక్ వినిపించింది.
ఇక తాజా సమాచారం ప్రకారం సుజిత్ కు డెంగీ జ్వరం సోకిందట. గత కొన్ని రోజులుగా జ్వరం ఉందట.. మెడికల్ టెస్టులు చేయించిన తర్వాత అది డెంగీ అని తేలిందట. సుజిత్ కు రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ కూడా తగ్గిపోయిందని దీంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడని.. ఇంట్లో సుజిత్ అమ్మగారు జాగ్రత్తగా చూసుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉంటే 'సాహో' సినిమా పట్ల అసంతృప్తిగా ఉన్నవారు సోషల్ మీడియా ద్వారా సుజిత్ ను టార్గెట్ చేయడం తెలిసిందే. సినిమా రిలీజై వారం దాటిపోయింది కాబట్టి ఇక ఆ విమర్శల వేడి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
డెంగీ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత సుజిత్ తన నెక్స్ట్ సినిమా గురించి అలోచిస్తాడేమో. ప్రస్తుతానికి అయితే సుజిత్ 'సాహో' ప్రభావం నుండి ఇంకా బయటకు రాలేదని అనిపిస్తోంది. ఏదేమైనా సుజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.