మరో 20 రోజుల్లో మోస్ట్ అవైటెడ్ `సాహో` థియేటర్లలోకి రాబోతోంది. ఆగస్టు 30 రాక కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ - శ్రద్ధా అండ్ టీమ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్.. దుబాయ్ సహా దేశంలోని ఐదు మెట్రోల్లో భారీ ఈవెంట్లను ప్లాన్ చేశారు. బెంగళూరు- పూణే- కొచ్చి- చెన్నయ్ లలో ఈవెంట్లు ప్లాన్ చేశారు.
తాజాగా హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ తేదీ లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఆగస్టు 18న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో అత్యంత భారీగా `సాహో` ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రభాస్ అభిమానులు ఎటెండ్ కానున్నారు. అలాగే దుబాయ్ లోనూ అంతే భారీ స్థాయి ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా గురించి నేడు హైదరాబాద్ మీడియాతో ముచ్చటించిన డార్లింగ్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. ఈ సినిమాలో అండర్ కవర్ ఆపరేషన్ చేసే అధికారిగా కనిపిస్తున్నారు. దానికోంస 007 తరహాలో ప్రయత్నించారా? అన్న ప్రశ్నకు సమాధానంగా.. జేమ్స్ బాండ్ లా ట్రై చేయలేదని ప్రభాస్ అన్నారు. తప్పనిసరిగా డిఫరెంట్ విజువల్స్ ఇవ్వడానికి ట్రై చేశాం. భారీ యాక్షన్ చిత్రంగా మలిచేందుకు సుజీత్ చాలా హార్డ్ వర్క్ చేశాడని తెలిపారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టిందని.. అబుదబీ ఛేజ్ సీన్ల కోసం ఏడెనిమిది నెలలు ప్రీవర్క్ సాగిందని ప్రభాస్ వెల్లడించారు. చైనా నుంచి స్పెషలిస్ట్ ఫైటర్లను రప్పించాం.. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ముందే చాలా రిహార్సల్స్ చేశాం. దర్శకుడితో కలిసి ప్రొడక్షన్ టీమ్ 6-8 నెలలు యాక్షన్ సీన్స్ కోసం ప్రిపరేషన్స్ సాగించారు. వాళ్లదే కష్టం..అని తెలిపారు.