డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సాహో. సుజీత్ దర్శకుడు. యు.వి.క్రియేషన్స్ సంస్థ దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది. అందుకు తగ్గట్టే దాదాపు 320 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగిందని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలు సహా దేశవిదేశాల్లో అత్యంత క్రేజీ గా రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లో ఫర్స్ ఫిలిమ్స్ (దుబాయ్) సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. సాహో దుబాయ్ ప్రీమియర్ల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
అయితే ఇటీవల సాహో అమెరికా ప్రీమియర్లు ఉండవని ప్రచారం సాగింది. నిర్మాతలే ప్రీమియర్లు వేయకూడదని భావించారని.. దాని వల్ల భారీ మొత్తాలు వెచ్చించి కొనుక్కున్న పంపిణీదారులు కలతకు గురయ్యారని ప్రచారమైంది. అమెరికా ప్రీమియర్లు లేకపోతే 10 కోట్ల మేర నష్టం వాటిల్లే వీలుందని మీడియాలో ప్రచారమైంది. దాంతో యంగ్ రెబల్ స్టార్ ఎన్నారై అభిమానులు తీవ్రంగా నిరాశ పడ్డారు.
వాస్తవానికి అమెరికా ప్రీమియర్ల నుంచి 1.5-2 మిలియన్ డాలర్ల వరకూ వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే ప్రీమియర్లు లేకుండా డైరెక్ట్ రిలీజ్ చేస్తే పంపిణీదారులకు కొంత నష్టం ఉంటుందని ప్రచారమైంది. ఒకవేళ డైరెక్ట్ రిలీజ్ చేస్తే 2 మిలియన్ల కంటే ఎక్కువ ఓపెనింగ్ డే రోజు వచ్చేదని విశ్లేషించారు. అయితే ఎవరు ఎలా ప్రచారం చేసినా ఎట్టకేలకు అమెరికా ఎన్నారైలకు తాజాగా ఓ శుభవార్త అందింది. సాహో అమెరికా ప్రీమయర్లు క్యాన్సిల్ కాలేదు. యథాతథంగా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్త ప్రభాస్ అమెరికా ఫ్యాన్స్ కి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఇక ఆగస్టు 29న అమెరికా ప్రీమియర్లు ఉంటాయట. అడ్వాన్స్ గా బుకింగ్స్ ప్రారంభమయ్యాయని వీటికి భారీగా క్రేజు నెలకొందని తెలుస్తోంది. తొలి రోజు తొలి షోకి విపరీతమైన క్రేజు నెలకొందని వెల్లడైంది. ఆగస్టు 30 రిలీజ్ సందర్భంగా సాహో టీమ్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లి మరీ ప్రచారం చేస్తోంది.