ఎంత చెట్టుకు అంత గాలి! ఆ తరహాలోనే భారీ బడ్జెట్ చిత్రాలకు ఈవెంట్లను ఆ రేంజులోనే ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో 2.0 ఆడియో ఈవెంట్ ను రజనీ-శంకర్-లైకా బృందం నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగా ప్లాన్ చేశారు. హాలీవుడ్ వాళ్లకే చెమటలు పట్టేంత భారీ ఖర్చుతో స్టేజ్ ని నిర్మించి అత్యంత భారీగా 2.0 ఆడియో ఈవెంట్ ని నిర్వహించి ఔరా! అనిపించారు.
ఆ తర్వాత మళ్లీ అలాంటి భారీ ఈవెంట్ వేరొకటి లేదు. అయితే ఈసారి `సాహో` కోసం అలాంటి ప్రయత్నం ఒకటి జరగనుందని ప్రచారం అవుతోంది. దుబాయ్ లో ఆ తరహా ఈవెంట్ ఒకటి జరగనుందని.. ఓవర్సీస్ హక్కులు కొనుక్కున్న ఫర్స్ ఫిలింస్ సంస్థ దుబాయ్ లో ఈ ఈవెంట్ ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తోందని ప్రచారమవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక యువి.క్రియేషన్స్ మాత్రం ఐదు మెట్రో నగరాల్లో ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ - చెన్నయ్- బెంగళూరు- కొచ్చి- ముంబైలో భారీ ఈవెంట్లకు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఉంది. హైదరాబాద్ ఈవెంట్ కి తాజాగా వెన్యూ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎల్బీ స్టేడియంలో భారీగా ఈవెంట్ ఉంటుందన్న మాట వినిపిస్తే .. అక్కడ కాదు రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేస్తున్నారని తాజాగా రివీలైంది. ఫిలింసిటీనే సాహో ఈవెంట్ కోసం ఎంచుకోవడానికి కారణం బాహుబలి సెంటిమెంటు అని చెబుతున్నారు. బాహుబలి కి ఈవెంట్ రామోజీ ఫిలింసిటీలోనే చేశారు. పెద్ద హిట్టయ్యింది. అందుకే ఇక్కడ చేస్తున్నారట. అలాగే ఎల్బీ స్టేడియంలో అప్పట్లో భరత్ అనే నేను ఈవెంట్ ని అత్యంత భారీగా నిర్వహించారు. ఇక సిటీ పరిధిలో భారీ ఫ్యాన్స్ ఈవెంట్లు అంటే ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది. అందుకే ప్రభాస్ ఈవెంట్ ని ఫిలింసిటీకి మార్చారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇలాంటి భారీ ఈవెంట్లు చేస్తే మార్కెట్ వర్గాల్లో నమ్మకం మరింత పెరుగుతుందా? అంటే అవుననే మాట కూడా వినిపిస్తుంటుంది. అయితే ఏం చేసినా సినిమాలో కంటెంట్ అల్టిమేట్ గా ఉంటేనే జనం ఆదరించేది. `సాహో` మేకింగ్ వీడియోలు.. టీజర్ తో పెంచిన హైప్ ని ట్రైలర్ తో ఇంకా పీక్స్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఆ అంచనాల్ని మించి సినిమా ఆద్యంతం ఆకట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఆ స్థాయిలో సుజీత్ తెరకెక్కించారా లేదా? అన్నది ఎగ్జయిటింగ్ ఎలిమెంట్. ఆగస్టు 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా సాహో అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.