రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో తాలూకు ప్రమోషన్ నిన్నటి నుంచి షేడ్స్ వీడియోతో ఊపందుకుంది. చాప్టర్ 1 అన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా వస్తాయని ఆశిస్తున్నారు అభిమానులు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఉత్సాహం కూడా వాళ్లలో ఉరకలు వేస్తోంది. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. నిన్న వదిలింది కేవలం మేకింగ్ వీడియో మాత్రమే. టీజరూ కాదు ట్రైలరూ కాదు. ఆడియో గురించిన ఊసు అసలే లేదు. సో కేవలం ప్రభాస్ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకోవడం కోసం ఇది విడుదల చేసారు అంతే. మూవీ రిలీజ్ గురించి ఇందులో ఎలాంటి అప్ డేట్ లేదు. ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి క్లారిటీ లేదు. కానీ కాస్త లోతుగా విశ్లేషిస్తే సాహో వచ్చే సంవత్సరం సెకండ్ హాఫ్ లో వచ్చే ఛాన్స్ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
సాహు కేవలం ఒక బాషకే పరిమితమై తీస్తున్న సినిమా కాదు. మూడు భాషల్లో అంతర్జాతీయ మార్కెట్ టార్గెట్ చేసుకున్నారు. సో ఏది ప్లాన్ చేసినా బాలీవుడ్ తో సహా ఏ భాషలోనూ ఇంకే క్రేజీ ప్రాజెక్ట్ తో క్లాష్ రాకుండా చూసుకోవాలి. అదంత ఈజీ కాదు కాని అసాధ్యం అనలేం. వచ్చే ఏడాది వేసవిలో క్రేజ్ తో పాటు రిలీజ్ విషయంలో మహేష్ బాబు మహర్షి అందరికంటే ముందుంది. ఏప్రిల్ 5ని లాక్ చేసారు కాబట్టి ఆ నెలలో సాహోని తీసుకొచ్చే ఆలోచన ఎంతవరకు చేస్తారనేది అనుమానమే.
మరోపక్క సైరా కూడా సమ్మర్ టైంకంతా పూర్తి చేసి సెంటిమెంట్ గా ఫీలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ డేట్ మే9న తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. బడ్జెట్ పరంగా హైప్ పరంగా సాహోతో సై అంటే సై అనే మెగా మూవీ కాబట్టి ఇవీ క్లాష్ అయ్యే ఛాన్స్ లేదు. పైగా యువితో రామ్ చరణ్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సో సైరా సాహోలు తక్కువ గ్యాప్ తో ఢీకొట్టే ఆలోచన ఇద్దరూ చేయరు. మరి జూన్ తర్వాత సాహో రిలీజ్ ప్లాన్ చేసుకుంటారో లేక సీజే వర్క్ ఒక కొలిక్కి వచ్చాక ప్రకటిస్తారో వేచి చూడాలి