డార్లింగ్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో ఈనెల 30న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మరో 12 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రిలీజ్ ముంగిట ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతూనే ఉంది. బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సునామీ వసూళ్లను సాధిస్తుందా? అంటూ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఈ భారీ చిత్రానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రేజు నెలకొంది. ఇండియాలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసే చిత్రంగా ట్రేడ్ నిపుణుల్లోనూ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ ప్రమాణాలతో ముఖ్యంగా దక్షిణాది సినిమా స్టామినాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాల్ని అందుకునేలా ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని మెట్రో నగరాల్లోనూ సునామీ పర్యటన చేస్తూ ప్రభాస్ అభిమానుల్ని మీడియాని కలుసుకుంటున్నారు. హైదరాబాద్.. కొచ్చి.. మైసూర్.. లో ప్రమోషన్స్ కోసం విజిటింగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో లక్ష మంది అభిమానుల సమక్షంలో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇక్కడ స్టేజీ నిర్మాణం కోసమే ఏకంగా 2కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వేదికపై ప్రత్యేకంగా సాహో వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారు.
ఈ ప్రపంచం అభిమానులకు షాక్ నిస్తుందట. సాహో మూవీ కోసం ఉపయోగించిన ఖరీదైన కార్ లు.. బైక్ లను ఎగ్జిబిషన్ పెడుతున్నారు. అలాగే దుబాయ్ షెడ్యూల్ లో ఉపయోగించిన భారీ ట్యాంకర్ ని కూడా ఇక్కడ డిస్ ప్లే చేస్తున్నారట. ట్యాంకర్ మాత్రమే కాదు.. ఇదే వేదికపై ఓ టాప్ సీక్రెట్ ని కూడా సాహో టీమ్ రివీల్ చేయనుంది. సాహో మూవీ కోసం ఒక సీక్రెట్ వాల్ట్ ని ఉపయోగించారు. దానిని ట్రైలర్ లోనూ చూపించారు. సాహో ప్రీరిలీజ్ వేదికపై ఈ వాల్ట్ ని డిస్ ప్లే చేయనున్నారట. అది అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ట్రీట్ అవుతుందని భావిస్తోంది టీమ్.