చిత్రం: ‘సాక్ష్యం’
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్ - పూజా హెగ్డే - జగపతిబాబు - రావు రమేష్ - వెన్నెల కిషోర్ - రవికిషన్ - అశుతోష్ రాణా - శరత్ కుమార్ - మీనా - జయప్రకాష్ - పవిత్ర లోకేష్ - బ్రహ్మాజీ - ఝాన్సీ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
ఛాయాగ్రహణం: ఆర్థర్ విల్సన్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: అభిషేక్ నామా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీవాస్
భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘లక్ష్యం’.. ‘లౌక్యం’ సినిమాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీవాస్ రూపొందించిన సినిమా ‘సాక్ష్యం’. ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. ఐతే పిల్లలు లేని ఒక పెద్దింటి దంపతులకు అతడు దొరకడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అమెరికాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిని చేస్తారు. ఐతే విశ్వ తాను ప్రేమించిన సౌందర్య లహరి (పూజా హెగ్డే) కోసం ఇండియాకు రాగా.. అక్కడ అతడికి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అతడి చేతిలో కొందరు దుర్మార్గులు ఒక్కొక్కరుగా హతమవుతారు. ఇంతకీ వాళ్లకు.. విశ్వకు ఉన్న సంబంధమేంటి.. వాళ్లందరూ అతడి చేతిలో ఎందుకు.. ఎలా హతం అయ్యారన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘ఎ ఫిలిం బై అరవింద్’ సినిమాలో గజల్స్ శ్రీనివాస్ తరహా పాత్రలో గీత రచయిత అనంత్ శ్రీరామ్ ‘సాక్ష్యం’లో ఒక పాత్ర పోషించాడు. అతనొచ్చి హీరోకు భవిష్యత్తులో జరగబోయే ఒక కథను ముందే చెబుతాడు. ఇది ఎప్పుడూ చూస్తున్న రొటీన్ సినిమానే కదా అంటూ కొట్టి పారేస్తుంది హీరో బృందం. కానీ ఆ తర్వాత అతను ఈ కథలో రివెంజ్ తీర్చుకునేది పంచ భూతాలని అంటాడు. వెంటనే హీరో ఎక్సలెంట్.. ఇలాంటి కథ ఇంతకుముందెన్నడూ వినలేదంటూ అతడికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ‘సాక్ష్యం’ దర్శకుడు శ్రీవాస్.. శ్రీనివాస్ కు కథ చెప్పినపుడు బహుశా ఇలాగే జరిగిందేమో అనిపిస్తుంది. ‘సాక్ష్యం’లో పంచభూతాల కాన్సెప్ట్ విని శ్రీనివాస్ ఎగ్జైట్ అయి ఈ సినిమా చేశాడేమో. కానీ ఈ కాన్సెప్ట్ వరకు బాగానే ఉన్నప్పటికీ మిగతాదంతా రొటీన్ వ్యవహారమే. కథను చెప్పే తీరులో పాత శైలినే అనుసరించడంతో ‘సాక్ష్యం’ సగటు మసాలా సినిమాలాగే అనిపిస్తుంది.
హీరో తండ్రి ఒక ఊరికి పెద్ద. తమకు అడ్డొచ్చాడని అతడిని విలన్లు చంపేస్తారు. పసి పిల్లాడిగా ఉన్న హీరో.. ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత పెరిగి పెద్దవాడై అదే ఊరికి వచ్చి విలన్ల అంతు చూస్తాడు. ‘సాక్ష్యం’ లైన్ ఇది. కొన్ని వందల సినిమాల్లో చూసిన కథే ఇది. కానీ దీనికి పంచభూతాల నేపథ్యాన్ని జోడించి ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీవాస్. నేల.. నిప్పుు.. నీరు.. గాలి... ఆకాశం.. ఈ పంచభూతాలూ హీరోకు జరిగిన అన్యాయానికి సాక్ష్యాలుగా నిలిచి.. అవే విలన్ల అంతు చూడటంలో హీరోకు సహకరించడం అన్నది వినడానికి కొత్తగా అనిపించే పాయింటే. లాజిక్ గురించి పట్టించుకోకుండా ఫాంటసీ ఎలిమెంట్ జోడించి.. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఈ కథను తీర్చిదిద్దాడు శ్రీవాస్. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ భిన్నంగానే అనిపిస్తుంది. కానీ ఈ కథను చెప్పే తీరే నిరాశ పరుస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ భారీతనం చూపించాలన్న తాపత్రయంతో అన్నీ ఓవర్ ద టాప్ వెళ్లిపోయారు. సన్నివేశాల్లో ఆసక్తి గురించి.. లాజిక్ గురించి పట్టించుకోలేదు. సినిమా మొత్తంలో యాక్షన్ ఎపిసోడ్లే స్టాండౌట్ గా నిలుస్తాయి. అవి మెచ్చే మాస్ ప్రేక్షకులకు ‘సాక్ష్యం’ ఓకే అనిపించొచ్చు. ఐతే కథనంలో బిగి కొరవడి.. పాత శైలిలో సాగడంతో ‘సాక్ష్యం’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నిరాశనే మిగులుస్తుంది.
బెల్లంకొండ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మాదిరే.. ఇందులోనూ కమర్షియల్ హంగులన్నింటినీ కొలిచి కొలిచి స్క్రిప్టులో నింపడం గమనించవచ్చు. ‘సాక్ష్యం’ కోసం కూడా అదే ప్రయత్నం చేశాడు శ్రీవాస్. ఐతే ఆ ఆకర్షణలన్నీ ఈ కథకు ఉపయోగపడలేదు. ఇందులోని రొమాంటిక్ ట్రాక్.. పాటలు.. కామెడీ పూర్తిగా తేలిపోయాయి. సినిమాలో సగం నిడివిని ఆక్రమించిన ఈ ఎపిసోడ్లు.. కథకు పెద్ద అడ్డంకిగా నిలిచాయి. ముందు కథకు మూలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించి.. ఆ తర్వాత బ్రేక్ ఇచ్చాడు శ్రీవాస్. ఇక అక్కడి నుంచి హీరో హీరోయిన్ల పరిచయం.. వారి మధ్య రొమాంటిక్ ట్రాక్.. కామెడీ అంటూ టైంపాస్ చేయించడానికి చూశాడు. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. ఈ ఎపిసోడ్ చాలా రొటీన్ గా.. బోరింగ్ గా సాగిపోవడంతో ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లిపోతుంది. దీనికి సమాంతరంగా విలన్ ట్రాక్ నడిపిస్తున్నా అది కూడా సాధారణంగా అనిపిస్తుంది. సినిమాలో తీసిపడేయదగ్గ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయి.
హీరో అసలు లక్ష్యం మొదలయ్యాక కానీ మళ్లీ ప్రేక్షకుడు ఈ కథలో లీనం కాడు. ఇక్కడి నుంచి ‘సాక్ష్యం’ సరైన ట్రాక్ లో నడుస్తుంది. విలన్లు ఒక్కొక్కరినే మట్టుబెట్టే సీన్లు రొటీన్ గానే అయినా చాలా పకడ్బందీగా తీర్చిదిద్దాడు శ్రీవాస్. యాక్షన్ కొరియోగ్రఫీ.. బ్యాగ్రౌండ్ స్కోర్.. కెమెరా పనితనం కూడా తోడవడంతో ‘సాక్ష్యం’ ద్వితీయార్దంలో ఓ మోస్గరుగానేఎంగేజ్ చేస్తూ సాగుతుంది. మిగతా వాళ్ల సంగతెలా ఉన్నా.. మాస్ ప్రేక్షకుల్ని మాత్రం ఈ సన్నివేశాలు అలరిస్తాయి. కానీ ప్రథమార్ధంలో మాదిరే రెండో అర్ధంలోనూ పాటలు మాత్రం స్పీడ్ బ్రేకర్లలాగే ఉంటాయి. లాజిక్ గురించి పట్టించుకోకూడదని మొదట్లోనే సంకేతాలిచ్చేశారు కాబట్టి ఈ విషయంలో కంప్లైంట్ చేయలేం. ఓవరాల్ గా చెప్పాలంటే మాస్ ప్రేక్షకులకు గిట్టు బాటు చేసే అంశాలున్న ‘సాక్ష్యం’ అందరికీ రుచించడం కష్టమే.
నటీనటులు:
బెల్లంకొండ శ్రీనివాస్ నటుడిగా కొత్తగా చేసిందేమీ లేదు. గత సినిమాల్లో మాదిరే కనిపించాడు. లుక్ పరంగా మెరుగయ్యాడు. మరింత ఫిట్ గా కనిపించాడు. బాగా బాడీ బిల్డ్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో మరోసారి మెప్పించాడు. డ్యాన్సుల్లోనూ ఆకట్టుకున్నాడు. ఐతే ‘జయ జానకి నాయక’లో మాదిరి అతను ఎమోషన్లు చూపించడానికి ఈ సినిమా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. పూజా హెగ్డేకు కూడా నటించేందుకు పెద్దగా ఆస్కారం లేదు. ఆమె గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకుంది. విలన్ పాత్రలో జగపతిబాబు మెప్పించాడు. రావు రమేష్ పర్వాలేదు. రవికిషన్.. అశుతోష్ రాణా పెద్దగా చేయడానికేమీ లేకపోయింది. జయప్రకాష్.. పవిత్ర లోకేష్.. శరత్ కుమార్.. మీనా ఉన్న కాసేపట్లో బాగానే చేశారు. వాల్మీకి పాత్రలో అనంత్ శ్రీరామ్ విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. వెన్నెల కిషోర్ ఏమాత్రం నవ్వించలేకపోయాడు. స్క్రీన్ టైం చాలానే ఉన్నప్పటికీ అతడి పాత్ర వృథా అయింది. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతికవర్గం:
‘అర్జున్ రెడ్డి’కి నేపథ్య సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాలో దానికి భిన్నమైన ఔట్ పుట్ ఇచ్చాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. మామూలుగా కమర్షియల్ సినిమాల్లో వినిపించే నేపథ్య సంగీతంతో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది. ప్రథమార్ధంలో కొన్ని సౌండ్స్ ఆడ్ గా అనిపిస్తాయి కానీ.. ద్వితీయార్ధంలో కీలకమైన సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. పంచభూతాల గురించి వివరించే పాట ఒకటే ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆర్థర్ విల్సన్ సినిమాకు ముఖ్య ఆకర్షణల్లో ఒకటి. సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది ఛాయాగ్రహణం. సాయిమాధవ్ బుర్రా కథకు కీలకమైన ఎపిసోడ్లలో.. కోర్ కాన్సెప్ట్ ను వివరించే సీన్లలో చక్కటి మాటలు రాశాడు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ కు రాసిన డైలాగులు ప్రత్యేకంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో ఢోకా లేదు. భారీగా ఖర్చు పెట్టారు. ప్రతి సన్నివేశంలోనూ భారీతనం కనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీవాస్.. ఎంచుకున్న కాన్సెప్ట్ ఓకే కానీ.. అతడి నరేషన్ అంత బాగా లేదు. అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. చాలా సీన్లలో సాగతీత కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్ల వరకు శ్రీవాస్ ప్రత్యేకత చూపించాడు. అక్కడక్కడా అతను బోయపాటిని అనుకరించినట్లుగా కనిపిస్తుంది.
చివరగా: సాక్ష్యం.. కాన్సెప్ట్ ఓకే కానీ..!
రేటింగ్-2.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre