టీజర్: వీడు 'సామాన్యుడు' కాదు..!

Update: 2021-12-25 14:30 GMT
యాక్షన్ సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో విశాల్. ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ చిత్రాలలో ''సామాన్యుడు" ఒకటి. తూ.పా. శరవణన్ దర్శకత్వం వహించిన సినిమాకి 'నాట్ ఏ కామన్ మ్యాన్' ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. రిపబ్లిక్ డే కానుకగా 2022 జనవరి 26న తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ''ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలని అనుకునే సామాన్యులు.. ఇంకొకరు ఆ సామాన్యులను డబ్బు పదవి అధికారం కోసం అంతం చేయాలని అనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తలరాతలను మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది'' అంటూ విశాల్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.

అధికారం కోసం ప్రజలను ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తిలపై అసామాన్యుడుగా మారిన ఓ సామాన్యుడు చేసిన పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో నిండిపోయిన పవర్ పాక్డ్ టీజర్ అలరిస్తోంది. 'సామాన్యుడు' ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగానే ఇందులో విశాల్ కామన్ మ్యాన్ లా కనిపించడం లేదు. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా 'సామాన్యుడు' టీజర్ చివర్లో విశాల్ చేసే ఫైట్ హైలైట్ గా నిలిచింది. స్టంట్ కొరియోగ్రఫర్ రవి వర్మ సారధ్యంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. యువన్ శకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కెవిన్ రాజ్ దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని.. తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇందులో విశాల్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా.. యోగిబాబు కీలక పాత్ర పోషించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.




Full View
Tags:    

Similar News