ట్రైలర్ టాక్: బొమ్మ చూపించే షూటింగ్ బామ్మలు!

Update: 2019-09-23 12:33 GMT
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న తాప్సీ ఈసారి 'సాండ్ కీ ఆంఖ్' అనే సినిమాతో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.  మరో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తో కలిసి నటించిన ఈ సినిమాను చంద్రో.. ప్రకాశి తోమర్ అనే రియల్ లైఫ్ షార్ప్ షూటర్ల జీవితం ఆధారంగా రూపొందించారు. 70 ఏళ్ళ వయసులో వారు నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడం.. పతకాలు సాధించడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.  ఈ చిత్రానికి తుషార్ హీరానందాని దర్శకుడు. 

ఈ సినిమా కోసం తాప్సీ.. భూమి ఇద్దరూ డీగ్లామరైజ్డ్ గా నటించడమే కాదు.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఒకరకం హిందీ యాసలో డైలాగ్స్ చెప్పడం జరిగింది.  ఇక ట్రైలర్ విషయానికి వస్తే "తుపాకి  అంటే తమాషా కాదు. ఇది మగవారికి ఆభరణం.  వారి చేతుల్లోనే బాగుంటుంది" అంటూ ఒక వ్యక్తి చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పురుషాధిక్య భావన ఉండే సమాజంలో.. ఒక  ఊర్లో తాప్సీ.. భూమి పెడ్నేకర్ లు వంటపని.. ఇంటిపని చేసుకుంటూ సగటు సాంప్రదాయ పల్లెటూరి మహిళల లాగానే ఉంటారు.  అయితే అనుకోని పరిస్థితులలో వారు తుపాకులను పట్టుకోవాల్సి వస్తుంది. మరి అది ఎంత దూరం పోయింది.. ఏవిధంగా వారు షూటింగ్ పోటీలలో పాల్గొన్నారు అనేది ఈ ట్రైలర్ లో శాంపిల్ గా చూపించారు.

అలా అని ట్రైలర్ అంతా సీరియస్ గా ఏమీ లేదు.. అక్కడక్కడా సిట్యుయేషనల్ కామెడీ కూడా ఉందనిపిస్తోంది.  రైలు ప్రయాణంలో పోకిరీలు ఏడిపిస్తుంటే వారిని తాప్సీ వారిని గన్ తో బెదిరించడం.. మరో సీన్ లో "అక్సయ్ కుమార్ మరవాయేగా హమారెకో" అంటూ అదో రకమైన పల్లెటూరి స్టైల్ లో చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  వయసుమళ్ళిన మేకప్.. గెటప్ మరీ పర్ఫెక్ట్ గా లేవు కానీ అదొక్క విషయం పక్కన పెట్టేస్తే..  అటు తాప్సీ.. ఇటు భూమి సూపర్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.  ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ ను చూసేయండి. అన్నట్టు 'సాండ్ కీ ఆంఖ్' అంటే అర్థం.. ఇంగ్లీష్ లో 'బుల్స్ ఐ'.


Full View

Tags:    

Similar News