ఆయన రాజమౌళి ఇగో మీద కొట్టాడట
మన దర్శక ధీరుడు రాజమౌళి తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం అరుదు. ఐతే తన బలం అని అతను చెప్పుకునేది ఒక విషయంలోనే. తానో మంచి స్టోరీ టెల్లర్ అంటుంటాడు జక్కన్న. ఒకట్రెండుసార్లు వేదికల మీద.. వేరే ఇంటర్వ్యూల్లో కూడా వినమ్రంగానే ఈ విషయం చెప్పుకున్నాడు జక్కన్న. ఐతే అంత మంచి స్టోరీ టెల్లర్ అనుకునే తనకు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ షాక్ ఇచ్చాడంటున్నాడు రాజమౌళి. ఆయన తన ఇగో మీద కొట్టాడని రాజమౌళి వెల్లడించాడు.
‘బాహుబలి’ కథ చెప్పడానికి తొలిసారి సాబును కలిసినపుడు ఆయన వింటూ వింటూ నిద్రపోయారట. తానో గొప్ప స్టోరీ టెల్లర్ అని భావించే తనకు అది చాలా ఇబ్బందిగా అనిపించిందని.. ఆయనలా చేయడం తన అహం మీద కొట్టినట్టనట్లయిందని రాజమౌళి తెలిపాడు. ఐతే సాబు మీద ఉన్న గౌరవంతో ఊరుకున్నాని.. ఈ సినిమా తీస్తున్నపుడు తన పనితనం చూపించడం ద్వారా సాబు ఆయన మీద తనకున్న కోపమంతా పోయేలా చేశారని.. మొత్తం బ్యాలెన్స్ చేసేశారని రాజమౌళి వెల్లడించాడు.
మరోవైపు ‘మగధీర’తో పాటు ‘బాహుబలి: ది కంక్లూజన్’ వీఎఫెక్స్ సూపర్ వైజర్ గా పని చేసిన కమల్ కణ్ణన్ గురించి చెబుతూ.. తాను సెట్లో అత్యంత గొడవ పడేది కమల్ తోనే అన్నాడు రాజమౌళి. వీఎఫెక్స్ విషయంలో తనను అందరూ పొగుడుతుంటారని.. అదంతా కమల్ కే చెందుతుందని.. ఆయన తనకో టీచర్ అని.. అసలు వీఎఫెక్స్ అంటే ఏంటన్నది కమల్ తనకు ఓనమాల నుంచి నేర్పించారని అన్నాడు జక్కన్న.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/