స‌భ్య‌సాచి వ‌ధువు సొగ‌సు చూడ‌త‌రమా

Update: 2019-09-24 05:54 GMT
బాలీవుడ్ బ్రైడ‌ల్ క‌లెక్ష‌న్ .. పీరియాడిక్ సినిమాల‌కు సంబంధించిన హీరోయిన్ల‌ జువెల్ల‌రీ క‌లెక్ష‌న్స్ కి, భారీత‌నం నిండిన హెరిటేజ్ డిజైనర్ డ్రెస్ ల‌కు పెట్టింది పేరు స‌భ్య‌సాచి డిజైన్స్‌. స‌భ్య‌సాచి ముఖ‌ర్జీ కోల్‌క‌త్తాకు చెందిన ఫేమ‌స్ డిజైన‌ర్. బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వజ్ఞుడు. ముఖ్యంగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ భారీ క‌ళాత్మ‌క చిత్రాల‌కు ఈయ‌న సాయం త‌ప్ప‌నిస‌రి.

ప‌నిచేసింది త‌క్కువ సినిమాల‌కే అయినా బ్రైడ‌ల్ క‌లెక్ష‌న్స్‌ కి మాత్రం కేరాఫ్ అడ్ర‌స్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌తో పెళ్లి కూతురుకు సంబంధించిన క‌లెక్ష‌న్స్ డిజైన్ చేయించుకోవాల‌ని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. అందులో రాజ‌కీయ నాయ‌కులు-బాలీవుడ్ సెల‌బ్రిటీలు- వ‌ర‌ల్డ్ బెస్ట్ ప‌ర్స‌నాలిటీస్ అత‌డిని సంప్ర‌దిస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో న‌ర్గీస్ డిజైన్స్ పేరుతో స‌భ్య‌సాచి ముఖ‌ర్జీ చేసే వెడ్డింగ్ క‌లెక్ష‌న్ల‌కు మంచి పేరుంది.

అందుకే బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు బాడా బాబులకు సంబంధించిన పిల్ల‌లు పెళ్లిళ్ల‌కు స‌భ్య‌సాచి డిజైన్స్ అంటే  అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. వింటేజ్ లుక్ లో పెళ్లి కూతుళ్లను త‌యారు చేయ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌. తాజాగా అందుకు సంబంధించిన డిజైన్స్ ప్ర‌ద‌ర్శ‌న వీడియోలు.. ఫోటోల్ని స‌భ్య‌సాచి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిగో పెళ్లి కూతుళ్ల‌ ర‌చ్చ మామూలుగా లేదిక్క‌డ‌. సాంప్ర‌దాయాన్ని మేళ‌విస్తూనే టూమ‌చ్ హాట్ గా క‌నువిందు చేసే అందాల‌తో న‌వ వ‌ధువులు హంగామా ఈ వీడియోలో క‌నిపిస్తోంది. న‌ర్గీస్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ డిజైన్స్ పేరుతో స‌భ్య‌సాచి డిజైన్ చేసే వింటేజ్ డ్రెస్సుల్లో వ‌ధువుల‌ సొగ‌సు చూడ‌త‌మా అన్నంత‌గా అల‌రిస్తున్నారు. రెండు క‌ళ్లు చాల‌వు అన్నంత‌ అందంగా.. అంత‌కుమించి హాట్ గా పెళ్లి కూతుళ్లు వేడెక్కిస్తున్నారు. స‌భ్య‌సాచి వ‌ధువు య‌మ హాట్‌ గురూ! అనే స్థాయిలో క‌లెక్ష‌న్స్ ని ప్ర‌ద‌ర్శిస్తూ అద‌ర‌గొట్టేస్తుంటాయి. స‌భ్య‌సాచి ముఖ‌ర్జీకి కోల్‌ కొతా-ముంబై- హైద‌రాబాద్ ల‌లో స్టోర్స్ వున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News