ఎంకి పెళ్లి అన్న సామెతలాగే ఉంది నాగచైతన్య వ్యవహారం. ఎవరైనా సరే... తన సినిమా తన వల్లే ఆలస్యమవుతోందంటే అంతగా బాధపడరు. కానీ వేరొకరి వల్ల ఆలస్యమవుతోందంటే మాత్రం ఫీలవక తప్పని పరిస్థితి. ఇప్పుడు నాగచైతన్య కూడా అలాగే ఫీలవుతున్నాడట. గౌతమ్ మీనన్ తో సినిమా అనగానే తనకి హిట్టిచ్చిన దర్శకుడు అంటూ ఎగిరి గంతేశాడు నాగచైతన్య. వెంటనే ఒప్పుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చెన్నైకి వెళ్లి నటించేశాడు. కానీ అంత చేసినా ఆ సినిమా అనుకొన్న సమయానికి విడుదల కావడం లేదు. ఆ విషయంలోనే నాగచైతన్య ఫీలవుతున్నాడట. అసలు ఆ సినిమా ఆలస్యమవ్వడానికి తానో, తన దర్శకుడో కారణం కాదు. తమిళ కథానాయకుడు శింబు. ఇదివరకొచ్చిన `ఏమాయ చేసావె` టైపులోనే గౌతమ్ మీనన్ `సాహసం శ్వాసగా సాగిపో` సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో శింబు హీరో - తెలుగులో నాగచైతన్య హీరో. రెండు వెర్షన్లనీ ఒకేసారి చిత్రీకరిస్తూ వచ్చారు.
చిత్రీకరణ అంతా సవ్యంగా సాగుంటే సంక్రాంతికో, ఫిబ్రవరికో ఆ సినిమా వచ్చేదే. కానీ శింబు గొడవల్లో ఇరుక్కుపోవడంతో ఆ సినిమా మరింత ఆలస్యమవుతోంది. ఏకంగా సమ్మర్ కి వాయిదా పడింది. శింబు బీప్ సాంగ్ వివాదంలో ఇరుక్కుపోయాడు. ఆయనపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. దీంతో కొంతకాలంగా ఆయన చిత్రీకరణలో పాల్గొనడం లేదు. రెండు వెర్షన్లూ ఒకేసారి చిత్రీకరించాలి కాబట్టి శింబు లేకపోవడంతో నాగచైతన్యకీ షూటింగ్ ఉండట్లేదు. దీంతో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. సినిమా ఆగిపోయిందన్న సంకేతాలు జనాల్లోకి వెళ్లకూడదు కాబట్టి తాజాగా తమిళంలో ఒక కొత్త టీజర్ ని రిలీజ్ చేశారు. సినిమా సమ్మర్ కి వచ్చేస్తుందని ఆ టీజర్ లో ప్రకటించారు. సో నాగచైతన్య సాహసాల్ని చూడాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.