ఇండస్ట్రీలో సక్సెస్ కే విలువ ఎక్కువ. వన్స్ సక్సెస్ లభించిందా? ప్రతీ ఒక్కరు వెంటపడుతుంటారు. స్టార్ హీరోలు, క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు అడ్వాన్స్ ఇస్తామంటూ.. మాకే సినిమా చేయాలంటూ పోటీపడుతుంటారు. ఇక స్టార్ హీరోల సంగతి సరే సరి. బ్లాక్ బస్టర్ సినిమా పడిందంటే అలాంటి సినిమా మాకు కావాలని దర్శకుల వెంట పడుతుంటారు. అదే ఒక్క ఫ్లాప్ పడిందా? అటు వైపు చూడటానికే ఇష్టపడరు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లు కొంత మంది ఎదుర్కొంటున్నారు.
అందులో ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ కూడా ఒకరు. శర్వానంద్ హీరోగా యువీ క్రియేషన్స్ నిర్మించిన మూవీ 'రన్ రాజా రన్'. ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్ తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ మూవీ మేకర్స్ కి భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. దీంతో ఏకంగా ప్రభాస్ తో వందల కోట్ల ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. 'బాహుబలి' తరువాత ప్రభాస్ నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది.
తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ స్థాయిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. దీంతో ఈ మూవీ తరువాత సుజీత్ మరో ప్రాజెక్ట్ ని దక్కించుకోలేకపోయాడు. 'రన్ రాజా రన్' మూవీ రిలీజ్ కు ముందు చాలా మంది స్టార్ హీరోలు, ప్రొడక్షన్ కంపనీలు సుజీత్ తో సినిమా చేయాలని ప్లాన్ లు చేశారు. కానీ 'సాహో' ఫలితంతో ఒక్కసారిగా తమ ఆలోచనలని మార్చుకుని సుజీత్ కు ముఖం చాటేశారు.
ఆ మధ్య 'లూసీఫర్' రీమేక్ కు దర్శకత్వం వహించే అవకాశం లభించింది. 'సాహో' ఫలితం ఎలా వున్నా సుజీత్ మేకింగ్ కి ముచ్చటపడిన మెగాస్టార్ పిలిచి మరీ 'లూసీఫర్' రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు. కథలో భారీ మార్పులు చేయాలని సూచించారు. అయితే సుజీత్ చేసిన మార్పులు చిరుకి నచ్చలేదట. దాంతో ఈ ప్రాజెక్ట్ సుజీత్ చేతులు మారి ఫైనల్ గా మోహన్‌రాజా చేతికి వెళ్లింది.
ఆ తరువాత దళపతి విజయ్ నటించిన 'థేరి' మూవీని తెలుగులో రీమేక్ చేయమని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆఫర్ ఇచ్చాడు. ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. పవన్ డేట్స్ కేటాయించే పరిస్థితిలో లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా పక్కకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఇదే రీమేక్ ని హీరో రామ్ చరణ్ తో చేయాలని యువీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోందట. దీనికి సుజీత్ నే దర్శకుడిగా ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.