‘ఫిదా’ సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత అత్యంత ఆకట్టుకున్న పాత్ర ఏది అంటే.. మరో మాట లేకుండా సీనియర్ నటుడు సాయిచంద్ చేసిన హీరోయిన్ తండ్రి పాత్ర అని చెప్పేయొచ్చు. ఒకప్పుడు మాభూమి.. శివ.. అంకురం లాంటి క్లాసిక్స్ లో నటించి.. 25 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉండిపోయిన సాయిచంద్.. ‘ఫిదా’ లాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తాను సరైన సినిమాతోనే సినిమాల్లోకి పునరాగమనం చేశానని భావిస్తున్నట్లు సాయిచంద్ చెప్పారు. తన పాత్ర.. తన నటన.. దానికొచ్చిన పేరు.. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసిందని సాయిచంద్ తెలిపారు.
సినిమా షూటింగ్ సందర్భంగా సాయిపల్లవితో కలిసి కొన్నాళ్లు ప్రయాణం చేశాక.. తనకు తండ్రితనం అంటే ఏంటో తెలిసొచ్చిందని సాయిచంద్ చెప్పారు. తాను నిజ జీవితంలో పెళ్లి చేసుకోలేదని.. తండ్రి కాలేదని.. పెళ్లెందుకు చేసుకోలేదంటే తన దగ్గర కారణాలు లేవని.. ఐతే ‘ఫిదా’ సినిమా చేయడం ద్వారా తాను నిజంగా తండ్రి అయిపోయిన భావన కలిగిందని ఆయనన్నారు. ఓ రోజు షూటింగ్ ముగించుకుని వెళ్తుంటే.. వెనుక నుంచి సాయిపల్లవి ‘నాన్నా’ అని పిలిచిందని.. తర్వాత తన దగ్గరికొచ్చి హత్తుకుందని.. ఆ సమయంలో తనకు అనుకోకుండా కన్నీళ్లు వచ్చేశాయని.. సాయిపల్లవిని నిజంగానే తన కూతురిగా భావించానని.. ఆమె టేక్ కేర్ అంటున్నపుడల్లా తన రూపంలో ఒక డాక్టర్ తనకు అండగా ఉందన్న భరోసా కలిగిందని సాయిచంద్ చెప్పారు. ‘ఫిదా’ పూర్తయ్యాక కూడా సాయిపల్లవితో తన అనుబంధం కొనసాగుతోందని చెప్పారు సాయిచంద్.