మెగా హీరో.. హీరోయిన్ ఇద్దరూ ఇద్దరే..

Update: 2015-08-24 04:07 GMT
సాయి ధరమ్ తేజ్ నటనలోనే కాదు మాటల్లోనూ మిగతా మెగా హీరోలకి తీసిపోనంటున్నాడు. అందుకు నిన్న జరిగిన సుబ్రహ్మణ్యం ఆడియో వేదికే సాక్ష్యం. అభిమానులంతా మెగాస్టార్.. మెగాస్టార్.. అని గోల చేస్తుంటే... సాయి వస్తారు అని సర్దిచెప్పినా వారు తగ్గలేదు. వెంటనే మనోడు ఒక్క డైలాగ్ తో వారి నోళ్ళు మూయించాడు. ఆ డైలాగ్ ఇదే - "నాకు ఓ కన్ను పవన్ అయితే మరోటి నాగబాబు. వాటి ద్వారా చూసే చూపు మెగాస్టార్ చిరంజీవి గారు. దానితోనే మిమ్మల్నందరినీ చూడగలుగుతున్నా". ఈ ఒక్క మాటతో అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు.

మెగా హీరోయిన్ గా పాపులర్ అయిన రెజీనా కూడా అస్సలు తగ్గలేదు. చిరుని ఉద్దేశిస్తూ మీరు కేవలం హీరోలకే కాదు నటీనటులందరికీ ఆదర్శవంతులు అంటూ మెగాస్టార్ ను బుట్టలో వేసుకుంది. అందరికీ చిరు కేక్ తినిపిస్తే రెజీనా మాత్రం మెగాస్టార్ నోరు తీపి చేసింది. అలా ఇద్దరూ ఇద్దరే అనిపించారు.

మెగాస్టార్ కూడా వీరి అభిమానానికి పొంగిపోయి.. సాయి నాలా ఉండటమే కాదు.. నాలా కష్టపడతాడు, నటులకి కావాల్సింది నేర్చుకునే తత్త్వం.. రెజీనా నిత్య విద్యార్థినిలా మెలుగుతూంటుంది. పైకి ఎదగడానికి ఇంతకుమించిన అర్హత మరితో ఉండబోదని రెండు మాటలతో వీరిద్దరినీ ఆశీర్వదించేశారు..
Tags:    

Similar News