మొత్తానికి సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా అంచనాల్ని అందుకుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. హరీష్ అద్భుతమైన సినిమా ఏమీ తీయలేదు కానీ.. మినిమం గ్యారెంటీ మూవీతో టార్గెటెడ్ ఆడియన్స్ ను బాగానే రీచ్ అయ్యాడు. సినిమాలో మైనస్ లు కూడా ఉన్నాయి కానీ.. వాటిని ప్లస్ లు డామినేట్ చేయడంతో సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఈ ప్లస్సుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సాయిధరమ్ - రెజీనాల జంట గురించే. ఈ మధ్య కాలంలో తెలుగులో ఓ హీరో హీరోయిన్ మధ్య కూడా ఇంత బాగా కెమిస్ట్రీ పండింది లేదు. ఇప్పటికే ఓ సినిమాలో చేసి ఉండటం వల్ల కావచ్చు.. వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల కావచ్చు.. సాయి - రెజీనాల మధ్య కెమిస్ట్రీ భలేగా వర్కవుటైంది.
రెజీనా సీనియర్.. పైగా రొమాన్స్ చేయడం కొత్తేమీ కాదు. ఐతే సాయిధరమ్ కొత్త వాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో రెజీనాతో కలిసి చాలా ఈజ్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేసుకెళ్లిపోయాడు. ఇద్దరి మధ్య ఓ లిప్ లాక్ కాని లిప్ లాక్ కూడా పెట్టాడు హరీష్ శంకర్. ఓ సన్నివేశంలో ఇద్దరి పెదవులు కలుస్తాయి. ఐతే బాలీవుడ్ లిప్ లాక్ ల తరహాలో శ్రుతి మించకుండా కేవలం.. అలా పెదవులు అలా తాకించి వదిలేశాడు. దీంతో ఈ ముద్దు వల్గర్ గా అనిపించకుండా.. రొమాంటిక్ గా ఉందన్న ఫీలింగ్ కలిగించింది. ఉయ్యాల్లోంచి రెజీనా బుగ్గ మీద ముద్దులు పెట్టే సీన్ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఇక పాటల్లో ఇద్దరూ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ వేసిన స్టెప్పులు కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా యాష్ కరేంగీ - గువ్వా గోరింకతో పాటల్లో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. మొత్తానికి తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య అరుదుగా కనిపించే కెమిస్ట్రీ.. సాయి - రెజీనాల మధ్య భలేగా వర్కవుటైంది.