రిస్క్ లో పడ్డ తేజు భాయ్

Update: 2018-07-07 05:22 GMT
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి డోలాయమానంలో పడింది. నిన్న విడుదలైన తేజ్ ఐ లవ్ యు మిక్స్డ్ టాక్ వచ్చి ఉంటే  పికప్ అవుతుందేమో అని ఆశించవచ్చు కానీ యునానిమస్ గా నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో మరో డిజాస్టర్ తన ఖాతాలో పడిందని ట్రేడ్ వర్గాలు ఖరారు చేస్తున్నాయి. ఈ రెండు రోజులు వీక్ ఎండ్ వల్ల ఏదోలా లాగించినా సోమవారం నుంచి మాత్రం కష్టమే అంటున్నారు. మాస్ ని మెప్పించే మూస కథలు తిప్పికొడుతున్నారు కాబట్టి సాఫ్ట్ గా ట్రై చేద్దామని ప్రేమకథను ఎంచుకున్న తేజు కు అది కూడా ఆశాజనకంగా లేకపోవడంతో ఫాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. నిజానికి ఇక్కడ తప్పంతా తేజు మీద నెట్టేయలేం. దర్శకుల పాత్ర కూడా చాలా ఉంది. తేజ్ ఐ లవ్ యు సంగతే తీసుకుంటే డార్లింగ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పవన్ తొలిప్రేమలో ఎయిర్ పోర్ట్  క్లైమాక్స్ ని వెంకటేష్ వాసులోని మ్యూజిక్ బ్యాండ్ కాన్సెప్ట్ ఇలా అన్ని కలగలిపి తన సినిమాలనే కాపీ కొట్టుకున్న దర్శకుడు కరుణాకరన్ భాద్యతే ఎక్కువగా ఉంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సహా అందరు ఎంత చేయాలో అంతా చేసారు. కానీ ఫలితం లేకపోయింది.

మొత్తానికి అందరూ భయపడినట్టే తేజు హ్యాట్రిక్ డిజాస్టర్ పూర్తి చేసుకున్నట్టే. తిక్క-విన్నర్-నక్షత్రం-జవాన్-ఇంటెలిజెంట్ సిరీస్ లో ఇప్పుడు తేజ్ ఐ లవ్ యు కూడా జాయిన్ అయినట్టే. ఇప్పుడు తేజు  ఆశలన్నీ మైత్రి సంస్థ నిర్మించబోయే చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్(వర్కింగ్ టైటిల్)మీదే ఉన్నాయి. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ మూవీ  దర్శకుడు కిషోర్ తిరుమల. మొదటి సినిమా నేను శైలజతో సూపర్ హిట్ అందుకున్నా రెండోది ఉన్నది  ఒకటే జిందగీ వర్క్ అవుట్ కాలేదు. నాని వద్దన్న కథనే తేజు ఓకే చేసాడనే ప్రచారం ఇప్పటికే ఫిలిం  సర్కిల్స్ లో ఉంది. తన జడ్జ్ మెంట్ మీద ఇప్పటికే అనుమానాలు ఉన్న నేపధ్యంలో ఇది హిట్ కావడం తేజకు  చాలా అవసరం. సునీల్ కూడా తేజు ఫ్రెండ్ గా ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నట్టు టాక్. మరి ఈ పరాజయాల పరంపరకు ఈ సినిమా అయినా అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News