మెగా షాక్ మైత్రి కి కూడా తగిలిందట!

Update: 2018-07-25 17:30 GMT
సినిమా ఇండస్ట్రీ లో హిట్స్ కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  ఒక్క హిట్ వస్తే అందరూ వెంట పడతారు.  కానీ అందరికీ అలా జరగదు.  కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి.  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఫ్లాపులవుతున్నా - ఇప్పటికీ తేజుతో సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా తేజు 'తేజ్ ఐ లవ్ యు' సినిమా తో ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.  దాంతో తేజు కాస్త బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు.

ఓ మూడు నెలల పాటు అమెరికా వెళ్లాలని అక్కడ, తన ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ చెయ్యాలని ప్లాన్ చేశాడట.  అదే విషయం తన నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్లయిన  మైత్రి మూవీ మేకర్స్ వారికి తెలిపాడట.  కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ సినిమాను ఆగష్టు నుండి మొదలు పెట్టాలని అనుకున్నారట మైత్రీ వారు.  తేజు కనుక 3 నెలల లాంగ్ బ్రేక్ తీసుకుంటే అక్టోబర్ కు గానీ తిరిగి రాడు.  దీంతో ఇక నవంబర్ నుండి వాళ్ళు సినిమా షూటింగ్ ప్లాన్ చేయాల్సి వస్తోంది.

ఏదేమైనా తేజు డబుల్ హ్యాట్రిక్ హీట్ మైత్రీ బ్యానర్ కు కూడా తగలడం వింతే.  మరి ఈ సినిమా తేజు తిరిగి వచ్చిన తర్వాత అయినా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం. ఎందుకంటే వరస ఫ్లాపుల తర్వాత చేసే సినిమా ఖచ్చితంగా హిట్టిచ్చేలా ఉండాలి. లేకపోతే తేజు కెరీర్ మరింతగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.  మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News