ఒక సినిమా హిట్ కావడానికి చాలా కారణాలే ఉంటాయి కానీ ఒక సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాలంటే మాత్రం ఆ సినిమా టైటిల్ క్యాచీగా ఉండడం తప్పనిసరి. నిజానికి టైటిల్ కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అదే సగం పబ్లిసిటీ చేసిపెడుతుంది. ఈ సూత్రాన్ని మెగా హీరో సాయి ధరం తేజ్ నమ్ముతున్నాడో ఏమో కానీ ఈమధ్య తన సినిమాలకు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఎంచుకుంటున్నాడు.
తేజు లాస్ట్ సినిమా టైటిల్ 'చిత్రలహరి'. ఈ సినిమా టైటిల్ వినగానే పాతికేళ్ళ క్రితం దూరదర్శన్ లోని పాటల కార్యక్రమం గుర్తొస్తుంది. అది తెలీనివారికి చిత్ర..లహరి అనే అమ్మాయిల పేర్లు స్ఫురిస్తాయి. ఇక తేజు -మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు 'ప్రతిరోజూ పండగే' అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను బుట్టలో పడేసే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాతో పాటు తేజు మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ సినిమాతో సుబ్బు అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సూపర్ క్యాచీ టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో తేజు సరసన నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుందని సమాచారం.
మరోసారి టైటిల్ గురించి మాట్లాడుకుంటే 1993 లో రిలీజ్ అయిన 'మనీ' సినిమాలో 'భద్రం బీకేర్ఫుల్ బ్రదర్' పాట నుంచే ఈ టైటిల్ ను తీసుకున్నారు. "భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు.. షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ" అంటూ ఆ పాట సాగుతుంది. అప్పట్లో ఈ పాట సూపర్ డూపర్ హిట్టు. మరి ఈ సూపర్ హిట్ పాట నుంచి తీసుకున్న టైటిల్ తో తెరకెక్కే తేజు మూవీ కూడా సూపర్ హిట్ గా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.