మెగా హీరోలు చేతులెత్తేశారట

Update: 2018-02-08 17:30 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న న్యూస్ ఏదైనా ఉందా అంటే.. అది మెగా హీరోల బాక్స్ ఆఫీస్ యుద్ధమే అని చెప్పాలి. రెండు సినిమాలు తప్పకుండా హిట్ అవుతాయని ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదని ఇద్దరు హీరోలు చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ లో మాత్రం ఆలోచన వేరే విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. చాలా వరకు ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ ని కొల్లగొడతారు అనే విషయంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

అయితే వీరిద్దరి బాక్స్ ఆఫీస్ యుద్ధంపై ఎన్ని రూమర్స్ వచ్చినప్పటికీ నిర్మాతల వల్లే యుద్ధమని ఇంతకుముందు కథనాలు చాలా వచ్చాయి. అయితే ఫైనల్ గా అదే నిజమైంది. మెగా పెద్దలు ఇద్దరి హీరోలపై గరమయ్యారని ఓ టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పోటీపై ఒక వివరణ ఇచ్చాడు. నేను వరుణ్ సినిమా రిలీజ్ డేట్ లపై చాలా చర్చలు జరిపాము. కానీ నిర్మాతలు ముందే డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. రెండు వైపులా మా ప్రయత్నాలు మేము చేశాము. ఫైనల్ గా వర్కౌట్ కాకపోవడంతో చేతులెత్తేశామని వివరణ ఇచ్చాడు.

అంతే కాకుండా కూర్చొని కొంచెం గట్టిగా పట్టు బట్టడంతో కనీసం ఒక రోజు అయినా తేడా వచ్చిందని ఎవరి సినిమాలకు ఎవరు పోటీ కాదని అభిమానులకు నచ్చితేనే చూస్తారని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. మరి ఈ ఇద్దరి హీరోలు అనుకున్నంత రేంజ్ లో హిట్టు అందుకుంటారో లేదో చూడాలి.      
Tags:    

Similar News