మ‌రింత‌కీ సుప్రీమ్ ఎవ‌ర‌బ్బా?

Update: 2016-05-01 11:30 GMT
మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌ కి సుప్రీమ్ హీరో అని పేరొచ్చేసింది. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌ లో టైటిల్ కార్డ్స్‌ లో ఆ బిరుదు వేసేసుకొన్నాడు కూడా. ఇప్పుడు ఏకంగా సుప్రీమ్ పేరుతో సినిమానే చేసేశాడు. ఈ నెల 5న ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నేనే సుప్రీమ్ అంటూ సాయిధ‌ర‌మ్ తేజ్ అద‌ర‌గొడ‌తాడ‌ని అంద‌రూ ఊహిస్తున్నారు. అయితే ఇంత‌లో ఓ జ‌ల‌క్ ఇచ్చాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌.

సినిమాలో సుప్రీమ్ నేను కాద‌న్నాడు. ఆ విష‌యాన్ని తెరపై చూస్తేనే మ‌జా అంటున్నాడు. సుప్రీమ్ ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ ఆ చిత్రం గురించి ప‌లు విష‌యాల్ని వెల్లడిస్తున్నాడు. తాను చేసిన తొలి క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇదే అంటున్నాడు. ఇలా అన్నీ చెప్పేస్తున్నాడు కానీ... సుప్రీమ్‌ కీ, ఈ సినిమా క‌థ‌కీ మ‌ధ్య సంబంధ‌మేంట‌న్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. సుప్రీమ్ ఎవ‌ర‌నే విష‌యంపైనే ఈ సినిమా ఆధార‌ప‌డి వుంటుంద‌ని అంటున్నాడు. సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ మాత్రం టాక్సీవాలా బాలు అని స్ప‌ష్టం చేశాడు. సుప్రీమ్ అనే క్యారెక్ట‌ర్‌ లో వేరొక‌రు ఎవ‌రైనా క‌నిపిస్తారా లేదంటే క‌థ‌లో దానికి ఇంకేదైనా ట్విస్టుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ఓ లీడింగ్ న్యూస్ పేప‌ర్‌ లో వ‌చ్చిన  వ్యాసంలో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న కారుకీ ఓ పేరు వుంటుంద‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి ఇందులో కారు పేరేంట‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే. మొత్తంగా చెప్పాల్సింది ఏదీ చెప్ప‌కుండా సినిమాపై క్యురియాసిటీని పెంచేస్తున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఆయ‌న కెరీర్‌ లోనే భారీ బ‌డ్జెట్టుతో తెర‌కెక్కిన సినిమాగా సుప్రీమ్ నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి రిజ‌ల్ట్ ఎలా వుంటుందో చూడాలి. ప‌టాస్‌ లాంటి స‌క్సెస్‌ ఫుల్ సినిమాని తీసిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన రెండో చిత్ర‌మిది. రాశిఖ‌న్నా బెల్లం శ్రీదేవి పాత్ర‌లో న‌టించింది.
Tags:    

Similar News