సుప్రీమ్‌ రేంజ్‌ ప్రూవ్ చేసుకోవాల్సిందే

Update: 2016-05-02 09:30 GMT
కేవలం 'సుప్రీమ్‌' అనే టైటిల్‌ పెట్టుకున్నంత మాత్రాన సుప్రీమ్‌ హీరో అయిపోయాడు అని సాయిధరమ్‌ తేజ్‌ కూడా అనుకోవట్లేదు. అయితే తను ఎలా అనుకున్నా కూడా.. అలాంటి ఓ టైటిల్‌ పెట్టుకొని వచ్చాడు కాబట్టి.. ఖచ్చితంగా ఇప్పుడు తన సుప్రీమ్‌ స్థాయి ఏంటనేది ప్రూవ్‌ చేసుకోవాల్సిందే.

గత సినిమా ''సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌''ను అప్పట్లో 21 కోట్లకు అమ్మేశారు. అయితే ఆ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుని 20 కోట్ల వరకు వసూలు చేసింది. మైనర్‌ లాసులు అక్కడక్కడా తప్పలేదు. ఇక 20 కోట్ల రేంజ్‌ హీరో అనే స్టాంప్‌ పడాలంటే.. వరుసగా నాలుగైదు సినిమాలు ఆ రేంజులోనే వసూళ్ళు చేయాలి. ఈ మధ్యన హీరో నాని ని అందరూ 25 కోట్ల హీరో అన్నారు. భలే భలే మగాడివోయి అంత వసూలు చేసింది. కాని కృష్ణగాడి వీర ప్రేమ గాధ దారుణంగా మిస్సయ్యింది. దానితో మార్కెట్‌ స్టెబిలిటీ అనేది లేదు. ఇప్పుడు సాయిధరమ్‌ కూడా కరెక్టుగా అదే గ్రూప్ లో ఉన్నాడు. ''సుప్రీమ్''తో రేంజును ప్రూవ్‌ చేసుకుంటే.. నిజంగానే సుప్రీమ్‌ హీరో అవ్వడానికి ఛాన్సుంటుంది. తేడా పడితే మాత్రం.. తదుపరి సినిమాలను తక్కువ రేట్లకు అమ్మకోవాల్సిందే.

పటాస్‌ ఫేం అనిల్‌ రావిపూడి రూపొందించిన సుప్రీమ్‌ సినిమాను దిల్‌ రాజు తమ్ముడు శిరీష్‌ నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇవాళే మొదలయ్యాయ్‌. మే 5న సినిమా విడుదలవుతోంది.
Tags:    

Similar News