ఎన్నడూ లేనంతగా ఈసారి ఏపీ ఎన్నికల్లో స్టార్ల ప్రమేయం కనిపిస్తోంది. రాజకీయాల్లో సినీతారల ప్రవేశం అంతకంతకు పెరుగుతోంది. తమకు జనాల్లో ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు రాజకీయాల్లోకి వెళ్లాలనే తత్వం స్టార్లలో పెరుగుతోంది. అందుకు 2019 ఎన్నికలు పెద్ద ఎగ్జాంపుల్ అని విశ్లేషిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ హోరాహోరీగా పోటీబరిలో దిగిన సంగతి తెలిసిందే. తేదేపా, వైకాపాలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని జనసేనాని పవన్ కల్యాణ్ తలపోస్తున్నారు. అయితే అతడికి ఈ ఎన్నికల్లో మెగా కాంపౌండ్ హీరోల నుంచి నామమాత్రపు సపోర్టు మాత్రమే దక్కడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగా బ్రదర్ .. ఆవేశపరుడైన నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కి అండగా నిలిచారు. జనసేన తరపున నాగబాబు నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్, నాగబాబులకు మద్ధతుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మద్దతు తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నిహారిక తదితరులు క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు. అయితే బన్ని కాస్త ఆలస్యంగా స్పందించారు . జనసేనాని పవన్ కల్యాణ్ ని కలుసుకుని విషెస్ అందించారు. మావయ్యకు తన అండదండలు ఎల్లపుడూ ఉంటాయని జనసేన గెలవాలని బన్ని ఆకాంక్షిస్తూ అభిమానులకు సందేశం పంపారు.
ఇక మెగా కాంపౌండ్ నుంచి సాయిధరమ్ తేజ్ జనసేనకు ప్రచారం చేయకపోవడంపై విమర్శలొచ్చాయి. అయితే దానికి కారణాలేంటో అతడు నిన్నటిరోజున మీడియాకి వివరించాడు. మావయ్య ప్రచారానికి అనుమతించలేదని, ఆయన మాట కాదని ఏదీ చేయలేనని అన్నారు. మరోసారి మావయ్యకు సపోర్ట్ చేయకపోవడానికి కారణమేంటి? అంటూ మీడియా నేటి `చిత్రలహరి` ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ప్రశ్నించింది. అందుకు సాయిధరమ్ తేజ్ అంతే కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ``పవన్ మావయ్య నాకు ఓ మాట చెప్పారు. సినిమాలైనా చెయ్.. లేదా రాజకీయాల్లోకి అయినా రా. ఏదో ఒకటే చెయ్. చేసేది నిజాయితీగా నిబద్ధతతో చెయ్. లేదంటే రావొద్దు. జనాలకు సేవ చేయాలని అనుకుంటేనే రాజకీయాల వైపు రా అని అన్నారు. నువ్వు వస్తానంటే నేను ఆపను. అయితే రెండు పడవలపై కాళ్లు వేయొద్దని అన్నారు`` అని తెలిపారు. అందుకే తాను రాజకీయాల్లోకి వెళ్లలేదని అన్నారు. జనసేనకు, మావయ్యకు తన నుంచి తన కుటుంబం నుంచి అన్ని వేళలా మద్ధతు ఉంటుందని వెల్లడించారు. అన్నట్టు సాయిధరమ్ తేజ్ ఇటీవల పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ నుంచి `ధరమ్` తప్పించారు. అందుకు కారణమేంటో అర్థంగాక బుర్ర గోక్కుంటున్న వాళ్లు ఉన్నారు. అందుకు కారణమేంటో తుపాకి నెక్ట్స్ ఆర్టికల్ లో..