పోలికతో తేజుని ఇబ్బంది పెడుతున్నారు

Update: 2018-05-31 06:22 GMT
అసలే టైం బాగాలేదు. ఎవరితో చేసినా వర్క్ అవుట్ కావడం లేదు. రెండేళ్ల క్రితం పాతిక కోట్ల సినిమాను ఇచ్చింది తనేనా అనే డౌట్ వచ్చేలా ఉంది సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న తేజుకు ఆ మధ్య వరస పరాజయాలు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టాయి. ఇప్పుడు తన ఆశలన్నీ తేజ్ ఐ లవ్ యు మీదే పెట్టుకున్నాడు. మావయ్య పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ లాంటి ఎవర్ గ్రీన్ హిట్ ఇచ్చిన దర్శకుడు కరుణాకరన్ దాని రేంజ్ లోనే తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాడు తేజు . అది సహజమే కానీ తేజ్ ఐ లవ్ యులో  సాయి ధరమ్ పాప్ సింగర్ నటిస్తున్నాడు అనే వార్తలతో పాటు మైకు పట్టుకుని పాట పడుతున్నట్టుగా ఉన్న పోస్టర్స్ సోషల్ మీడియాలో  బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. సరే విడుదలకు టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచే టచ్ లో ఉంటే హైప్ పెరుగుతుంది అని భావించిన తేజు నిన్న రాత్రి  ట్విట్టర్ లైవ్ లోకి వచ్చాడు. అందులో లుక్ కు సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది.

ఇదే కరుణాకరన్ గతంలో ప్రభాస్ తో తీసిన డార్లింగ్ సినిమా తరహాలోనే తేజ్ ఐ లవ్ యులో సాయి ధరమ్ తేజ్ లుక్ ఉందని కొందరు అభిమానులు నేరుగానే అడిగేసారు. మనసులో ఏమనుకున్నాడో ఏమో కానీ తేజు మాత్రం చేతిలో గిటార్ మైకు ఉన్నంత మాత్రాన అలా పోల్చడం ఏంటని ఇది వేరే అని సర్దిచెప్పాడు. నిజానికి కరుణాకరన్ కు ఇలా చూపడం కొత్తేమి కాదు. డార్లింగ్ కన్నా ముందు వాసు సినిమాలో వెంకటేష్ ను కూడా అలాగే చూపించాడు. అది ఆడలేదు కానీ డార్లింగ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇటీవలే కృష్ణార్జున యుద్ధంలో నాని వేసిన పాప్ సింగర్ పాత్రతో తేజుకు ముడిపెడుతూ కొత్త విశ్లేషణ మొదలుపెట్టారు. మొత్తానికి తేజుకి ఇవన్నీ చికాకు కలిగించేవే. కానీ బయటపెట్టుకోలేడు కదా. ఇది తనకే కాదు ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న దర్శకుడు కరుణాకరన్ కు కూడా కీలకమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాస్ ఎలెమెంట్స్ కి తావివ్వకుండా తేజ్ ని కొత్త తరహాలో లవ్ స్టోరీ లో ప్రెజెంట్ చేసే ప్రయత్నం జరిగినట్టు టాక్.
Tags:    

Similar News