సీతను అరెస్టు చేయండి.. అలరిస్తున్న సాయి ధరమ్ ట్వీట్

Update: 2022-08-10 04:18 GMT
గొప్ప సినిమా.. అద్భుతమైన సినిమా అంటూ చెప్పే అలవాటు ప్రతి సినిమా రిలీజ్ ముందు చెప్పేస్తున్న వేళ.. నిజంగానే అలాంటి అరుదైన సినిమా వచ్చేస్తే? ఎలా ఉంటుంది? సరిగ్గా సీతారామం మాదిరి ఉంటుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు కూడా అలాంటి సర్ ప్రైజ్ లో ఉన్నారు. సీతారామం చూసినోళ్లంతా వావ్ అనేస్తున్నారు. ఇలాంటి కల్ట్ క్లాసిక్.. అందులోనూ తెలుగులో చూసి ఎన్నాళ్లైందన్న మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తోంది. ఎవరికి వారు సీతారామం ప్రేమలో పడిపోతున్నారు. ఆ ప్రేమలో మునిగిపోతూ.. తమ మనసుల్ని విప్పేస్తున్నారు.

తాజాగా అలాంటి పనే చేశాడు మెగా కాపౌండ్ లో కాస్త డిఫరెంట్ హీరోయిజాన్ని ప్రదర్శించే సాయి ధరమ్ తేజ్. తాజాగా అతడు పోస్టు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అఖిల్ నటించిన  ‘హలో’ సినిమాలో.. ప్రేమ ఎక్కువ అయితే ఐ హేట్ యూ చెబుతారన్న డైలాగ్ స్ఫూర్తిగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

అందులో ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన అశ్వనీదత్ కుమార్తె స్వప్నను తెగ పొగిడేశాడు. అన్నింటికి మించి అతను చెప్పిన మాటల్లో అందరిని ఆకర్షించే అంశం.. ఈ సినిమా చూసిన తర్వాత.. సింగిల్ గా ఉన్న తనకు కూడా ఒక ప్రేమకథ ఉంటే బాగుండు అనిపించేలా చేశావ్ అని స్వప్న అక్కను కొనియాడాడు.

చిత్ర దర్శకుడు హను రాఘవపూడి గురించి చెబుతూ.. ప్రతి ఫ్రేమ్ ను మ్యాజిక్ తో నింపి నీ పని  తనాన్ని చూపించావంటూనే.. సెకండ్ ఆఫ్ ను చెడగొట్టే అలవాటును ఈ సినిమాతో దిగ్విజయంగా అధిగమించిన విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. ఒక అద్భుతమైన పెయింటింగ్ ను.. మ్యూజిక్ పీస్ నుక్రియేట్ చేశామన్నారు.

చిత్ర హీరో దుల్కర్ సల్మాన్.. సీనియర్ నటుడు సుమంత్.. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ తో అందరిని పేరు పేరునా పొగిడేస్తూ.. అందరికి ఐ హేట్ యూ చెప్పేసిన సాయి ధరమ్.. సీత వద్దకు వచ్చేసరికి మాత్రం.. సింఫుల్ గా ఆమెను అరెస్టు చేయాలని కోరాడు.

‘దయచేసి ఆమె మీద కంప్లైంట్ తీసుకొని అరెస్టు చేయండి. ఎంతోమంది హృదయాలను ఆమె గాయపరిచింది. నేను ఐ హేట్ యూ అని మర్చిపోయి వేరేది చెప్పేలోపు దయచేసి ఆమెను అరెస్టు చేయండి’ అంటూ రాసిన ట్వీట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రీల్ సీత మీద ప్రేమను సాయి ధరమ్ మాదిరి ఇప్పటివరకు మరెవరూ ప్రదర్శించలేదేమో? అన్నట్లుగా అతగాడి ట్వీట్ ఉందని చెప్పాలి.
Tags:    

Similar News