త‌మ్ముడికి సాయితేజ్ లేఖ‌.. ఎమోష‌న‌ల్ అయిన అన్న‌..!!

Update: 2021-02-12 03:43 GMT
మెగా కాంపౌండ్ నుంచి వ‌స్తున్న మ‌రో హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు అయిన‌ వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడే విడుద‌ల‌వుతోంది.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ మెగా ఫ్యామిలీలో చాలా మంది ఈ సినిమా గురించి మాట్లాడ‌గా.. తాజాగా త‌న త‌మ్ముడి సినిమా గురించి స్పందించాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు త‌న‌ ప్రియ‌మైన‌ త‌మ్ముడికి ఓ లేఖ రాశాడు. అందులో చాలా ఎమోష‌న్ అయ్యాడు తేజు.

త‌న సోద‌రుడు చూస్తుండ‌గానే ఎంత పెద్ద‌గా ఎదిగాడోనంటూ ఒక అన్న‌గా భావోద్వేగానికి గుర‌య్యాడు సాయి. ఆ లేఖ‌లోని ఉద్వేగం త‌మ్ముడిపై ఎంత ప్రేమ ఉన్న‌దో చాటిచెప్పింది. ఇంత‌కీ ఆ లేఖ‌లో ఏం రాశాడంటే...

‘‘త‌మ్ముడూ.. ఫైన‌ల్ గా నీ సినిమా రిలీజ్ కాబోతోంది. నాకు చాలా ఆనందంగానే కాదు.. గ‌ర్వంగా కూడా ఉంది. నిన్న‌టికి నిన్న చిన్న‌పిల్లోడివి.. ఇవాళ వెండి తెర‌పై క‌నిపించ‌బోతున్నావు. నాకు తెలుసు.. నీలో కొంత ఆందోళ‌న‌.. మ‌రింత ఎగ్జైట్ మెంట్ ఉన్నాయి. నా మొద‌టి సినిమా రిలీజ్ అవుతున్న‌ప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను. నీ ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంది. అయితే.. అంతా సాఫీగా సాగుతుంద‌ని చెప్ప‌లేను. కానీ.. ప్రేక్ష‌కుల నుంచి అంతులేని ప్రేమ‌ను మాత్రం నువ్వు పొందుతావు. నీకు ఇదొక గొప్ప రోజు.  నీకే కాదు మాక్కూడా. ఉప్పెన యూనిట్ కు నా శుభాకాంక్ష‌లు. నిన్ను తెర‌పై చూసేందుకు నేను వెయిట్ చేయ‌లేక‌పోతున్నాను’’ అంటూ తన లేఖ‌ను ముగించాడు సాయితేజ్‌.

ఈ లేఖ‌ను త‌న‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు తేజూ. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక‌, మ‌రికొన్ని గంట‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. మ‌రి, ఎలాంటి టాక్ వ‌స్తుందో.. వైష్ణ‌వ్ డెబ్యూ మూవీ ఎలాంటి రిజ‌ల్ట్ సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.
Tags:    

Similar News