మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ రిపబ్లిక్ మూవీ తర్వాత చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. రిపబ్లిక్ రిలీజ్ టైం లోనే బైక్ యాక్సిడెంట్ వల్ల చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్లిన సాయి ధరం తేజ్ దాదాపు రెండు నెలల తర్వాత మామూలు మనిషి అయ్యాడు. అయినా కూడా ఆ యాక్సిడెంట్ వల్ల తేజ్ మాట్లాడటం లో కొద్దిగా తడపడుతున్నాడని తెలుస్తుంది. ఆమధ్య వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరం తేజ్ మాటలు అందరిని ఆశ్చర్యపరచాయి.
యాక్సిడెంట్ వల్ల బాగా డిస్టర్బ్ అయిన సాయి తేజ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని మళ్లీ షూటింగ్ కి రెడీ అయ్యాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ నూతన దర్శకుడు కార్తీక్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నారు.
పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ రాబోతుందట. సినిమా షూటింగ్ జరుగుతున్నా ఇప్పటివరకూ దానికి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా బయటకు రానివ్వలేదు.
ఫైనల్ గా సాయి ధరం తేజ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ లాక్ చేశారట. డిసెంబర్ 7న మెగా మేనల్లుడి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.
సినిమాలో సాయి ధరం తేజ్ సరసన మళయాళ భామ సంయుక్త మీనన్ నటిస్తుంది. అంతేకాదు సినిమాకు రీసెంట్ గా కాంతార మూవీ కి మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
డిసెంబర్ 7న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రిపబ్లిక్ అంచనాలను అందుకోకపోవడంతో ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.