అన్నపూర్ణ స్టూడియోలో పాములు పట్టిన హీరో!

Update: 2017-01-11 04:49 GMT
"నువ్వేకావాలి" సినిమా చూసిన వారందరికీ "అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేగం ఉంది.." పాట కచ్చితంగా గుర్తుటుంది.. ఆ పాట గుర్తుందంటే, సాయికిరణ్ కూడా గుర్తుంటాడు. అనంతరం అడపా దడపా కొన్ని సినిమాలు చేసినా ప్రత్యేకంగా "నువ్వేకావాలి" సినిమాలో సాయికిరణ్ కి ఫుల్ ఫ్యాన్స్ వచ్చేశారనే చెప్పాలి. అయితే సినిమా నటుడిగా ఉన్న సాయికిరణ్ కి ఇన్నర్ టాలెంట్ కూడా ఒకటుందట. అది కూడా ఆటలు ఆడటం -  పాటలు పాడటం - ప్రయాణాలు చేయడం వంటివి కాదు సుమా... పాములు పట్టుకోవడం!

అవును హీరో సాయికిరణ్ పాములతో చెలగాటం ఆడుతుంటాడట. చిన్నప్పటినుంచీ పాములంటే అసలు భయంలేదని, శివుడంటే ఉన్న భక్తివల్ల వాటిపై భయం లేదు సరికదా ప్రేమ కూడా పెరిగిందని చెబుతున్నాడు. ఈ క్రమంలో పాములతో తన ప్రయాణం గురించి తాజాగా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు సాయికిరణ్.

చిన్నప్పుడు స్కూల్లో.. చెట్లకు వానపాములు ఎంతో మేలుచేస్తాయని సైన్స్ టీచర్ చెప్పడంతో చెట్ల మొదళ్లలో వాటిని వేయాడంతో మనోడి సావాసం మొదలైందట. ఇలా మొక్కల మొదళ్లలో వానపాములు వేసే క్రమంలో సడన్ ఒక వానపాము అనుకుని చిన్న త్రాచు పామును పట్టుకున్నాడట. దాంతో అది ఇతని వేలుకు చుట్టుకుని బుసలు కొడుతుందట. ఇది చూసిన వాళ్లు దాన్ని కిందపడేసి చంపేశారట. అది త్రాచు పమనై, కరిస్తే చచ్చిపోతావని చెప్పేవరకూ అది పామనే విషయం తనకు తెలియదని చెబుతున్నాడు సాయికిరణ్. అనంతరం ఇంట్లో వాళ్లు ఆ పామును చంపడంతో మనోడి మనసు కకావికలం అయిపోయిందట.

ఇలాగే మరోసారి తాను వెళ్తున్న రోడ్డుపై పాము కనిపించేసరికి అంతా దానిచుట్టూ మూగడం, చంపాలని చూడటంతో ఆ పామును పట్టుకుందామని సాయికిరణ్ ముందుకువెళ్లేసరికి అతన్ని వెనక్కు లేగేసిన ఆ పామును చంపేశారట అక్కడున్న జనం. దీంతో పాములను పట్టుకోవడం నేర్చుకోవాలని భావించి సైనిక్ పురి లో ఉండే పాములను సంరక్షించే సంస్థలో శిక్షణ తీసుకున్న అనంతరం ఎన్నో పాములను పట్టుకున్నాడట. చిరంజీవి, నాగార్జున, పవన్, నాగబాబు వంటి ప్రముఖుల ఇళ్లలో పాములు పట్టడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌ లో కూడా రెండు మూడు సార్లు పాముల్ని పట్టుకున్నాడట. ఇలా ఇప్పటివరకూ సుమారు 3000కు పైగా పాములను పట్టుకున్నాడట సాయికిరణ్!! వామ్మో...
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News