మంచి సినిమాలు వస్తుంటే మాత్రం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎవ్వరూ విడిచిపెట్టట్లేదు. ఆ మధ్యన 'బాహుబలి' సినిమా వస్తున్నప్పుడు వెంటనే దిల్ రాజు నైజాం ఏరియా రైట్స్ కొనేసుకున్నారు. అలాగే యువి ప్రొడక్షన్స్ వారు తమిళ రైట్లను కొనుకున్నారు. మొన్న జనతా గ్యారేజ్ కూడా రాజు గారే కొనుకున్నారు. ఇకపోతే ఇప్పుడు 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై కూడా అందరి కళ్ళూ ఇలాగే పడుతున్నాయి.
నందమూరి బాలయ్య 100వ చిత్రం దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న హిస్టారికల్ సినిమా ఇది. ఇప్పటికే అబ్బురపరిచే రీతిలో సినిమా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను క్రయవిక్రయాలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ.. అప్పుడే బిజినెస్ కూడా మొదలెట్టేసినట్లున్నారు. సీడెడ్ ఏరియా రైట్స్ అప్పుడే అమ్మేశారట. తమకు కంచుకోట అయిన ఈ ఏరియాను వారాహి సినిమా (సాయి కొర్రపాటి) వారు 9 కోట్లకు దక్కించుకున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా ఇదే జానర్ కు సంబంధించిన సినిమా కావడంతో శాతకర్ణికి కూడా బాగానే డిమాండ్ చేస్తున్నారట.
ఆంధ్ర ఏరియా రైట్లకు 30 కోట్లు.. అలాగే నైజాం ఏరియా రైట్ల కోసం 18 కోట్లు చెబుతున్నారట. మరి ఆ రేంజులో నిజంగానే బాలయ్య సినిమాకు సమర్ఫించుకుంటారా అనేదే చూడాల్సి విషయం. దర్శకుడు క్రిష్ సినిమాలో కంటెంట్ ఫిలసాఫికల్ గా ఉంటుంది కాని.. మాసెస్ ను అలరించే రేంజులో ఇప్పటివరకు సినిమాలే తీయలేదు. అయినాసరే బాలయ్య ప్రెజెన్స్ కారణంగా సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అది సంగతి.