జాతీయ చిహ్నంపై కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే .. కనిపించే ఆ నాలుగో సింహమేరా పోలీస్.. ఈ డైలాగ్ చాలు సాయికుమార్ పేరు గుర్తు తెచ్చుకోవడానికి. పోలీస్ అన్న పదానికి పర్యాయపదం అతడు. చిన్నప్పుడు పోలీస్ అవుదామనుకున్నాడు. కానీ విధి వేరేగా ఉంది. నటుడయ్యాడు. అందుకే వెండితెరపై పోలీస్ పాత్రల్లో నటించేప్పుడు పూనకం వచ్చినట్టే కనిపిస్తాడు. పోలీస్ పాత్రలకు కేరాఫ్ అయ్యాడు. అరదుకేనేమో ఏపీ ప్రభుత్వం అతడిని 'విజయవాడ పోలీస్'కి బ్రాండ్ అంబాసిడర్ ని చేసింది. ఈ సందర్భంగా సాయికుమార్ ఎమోషనల్ గా మాట్లాడుతూ చాలా సంగతుల్ని చెప్పారిలా..
=పోలీస్ గా నటించినందుకు నా జీవితంలో ఇదే బెస్ట్ అవార్డ్. విజయవాడ పోలీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికవ్వడాన్ని మించిన గొప్ప వరం ఇంకోటి లేదు.
=ఇప్పటికి రెండు నందులు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నా. అయినా ఇప్పటికీ ఓ డెబ్యూ నటుడిలాగే ఇన్‌సెక్యూరిటీ పీలవుతుంటా. ఎందుకంటే నాకొచ్చే ఏ రోల్ కూడా నా కోసం రాసింది కాదు.
=1997 నుంచి 2003 మధ్య 50 సినిమాల్లో నటిస్తే, అంత పీక్స్‌లోనూ ఏ పెద్ద ఫిలింమేకర్ పిలిచి అవకాశాలిచ్చిందే లేదు. టాప్ డైరెక్టర్ మణిరత్నం లాంటి వారితో పనిచేసే అవకాశం రాకపోవడాన్ని రిగ్రెట్ గా ఫీలవుతుంటాను.
=ఓ రెండు సినిమాలతో తెలుగులో హీరో గా ప్రయత్నించినా అవి పరాజయాల్నే మిగిల్చాయి. ఆ టైమ్ లోనే కన్నడ అనువాదం పోలీస్ స్టోరి వచ్చి హిట్ కొట్టింది. తర్వాత సోదరుడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో 'ఈశ్వర్ అల్లా' అనే చిత్రంలో నటించాను. ఆ సినిమా కోసం ఫైనాన్సియర్ల వద్ద రూ.2కోట్లు అప్పు తెచ్చా. సినిమా రిలీజ్ పెద్ద సమస్యల్లో చిక్కుకుంది. బాగా ఆలస్యమైంది. దాంతో ప్రతి రూపాయిని ఫైనాన్షియలర్ల కు వెనక్కి చెల్లించాల్సొచ్చింది. అంతేకాదు అరెస్టు వారెంట్ కూడా అందుకున్నా. ఆ అప్పు తిరిగి తీర్చడానికి దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించాల్సొచ్చింది.
=నా సినిమాలన్నీ మెజారిటీ భాగం హీరోయిన్లు లేకుండానే. గ్లామర్ లేకుండానే సాగాయి. అయినా నేనేమీ బాధపడలేదెన్నడూ.
=చెన్నయ్ లో ప్రివ్యూ థియేటర్ల లో విఐపీ షోలు వేసేప్పుడు నాన్నతో పాటు కుటుంబ సభ్యులంతా వెళ్లేవాళ్లం. అయితే అక్కడ సీట్లు సరిపోకపోతే మొదటగా లేపేసేది మా కుటుంబ సభ్యుల్నే. అది ఇర్రిటేషన్ తెప్పించేది. పోలీస్ స్టోరి రిలీజైన తర్వాత ఓ థియేటర్ నే బుక్ చేశాను. కేవలం నా కుటుంబం కోసం.
=1000పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. అమితాబ్, మమ్ముట్టి, రజనీకాంత్, సుమన్, రాజశేఖర్ .. ఎందరో. సిల్వస్టర్ స్టాలోన్ ర్యాంబో సినిమాకి కూడా డబ్బింగ్ చెప్పాను. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ శివాజీ గణేషన్ సినిమా పసమలార్ (1981)కి డబ్బింగ్ చెప్పింది. అందుకే నేను శివాజీ కి పెద్ద అభిమానిని.
=నాన్న, నేను .. డబ్బింగ్ కళాకారులుగా ఎన్నో కష్టాల్ని అధిగమించాం. కానీ ఆది తనంతట తానుగా తనని నటుడిగా ఆవిష్కరించుకుంటున్నాడు. ఇది ఎంతో సంతోషం.