సాయికుమార్ కి ప్రేమతో జూనియర్

Update: 2016-02-22 09:33 GMT
దర్శకుడు కొరటాల శివ కాస్టింగ్ తోనే కేకలు పెట్టించేయాలని డిసైడ్ అయినట్లుగా ఉన్నాడు. ఈయన మొదటి సినిమా ప్రభాస్ మిర్చి అయినా, రెండో మూవీ మహేష్ బాబు శ్రీమంతుడు అయినా.. కేరక్టర్ల ఎంపిక మాత్రం సూపర్బ్ అనాల్సిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న జనతా గ్యారేజ్ విషయంలోనూ పాత్రల కోసం నటుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. ఆశ్చర్య పరుస్తున్నాడు కూడా.

జనతా గ్యారేజ్ లో డైలాగ్ కింగ్ సాయి కుమార్ ని తీసుకున్నారు. ఈయన యంగ్ టైగర్ కి తండ్రిగా నటించనుడడం విశేషం. ఈ మూవీలో ఇప్పటికే మోహన్ లాల్ - సమంత - నిత్యా మీనన్ - ఉన్ని ముకుందన్ లను కూడా సెలెక్ట్ చేశారు. మోహన్ లాల్ పాత్ర ఎన్టీఆర్ కి అంకుల్ అయితే.. తండ్రిగా సాయికుమార్ నటించనున్నారు. ఇదో ఫ్యామిలీ డ్రామా కాగా.. సాయి కుమార్ - మోహన్ లాల్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ కానున్నాయట.

ఈ సీనియర్లు ఇద్దరి మధ్య అనుబంధం, ఆ తర్వాత గొడవల కారణంగా కుటుంబాలు విడిపోవడం.. ఇలా ఉంటుందట ట్రాక్. మార్చ్ 5నుంచి జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ కానుండగా... మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగస్ట్ 12 న విడుదల చేసేలా.. జనతా గ్యారేజ్ యూనిట్ ప్లాన్ చేసుకుంది.

Tags:    

Similar News