రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే అప్పటికి సాయికుమార్ ను ఒక స్టార్ డబ్బింగ్ ఆర్టిస్టుగా మాత్రమే గుర్తించేవాళ్లు. నటుడిగా చిన్నా చితకా వేషాలు వేసినా అవేమీ ఆయనకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అలాంటి స్థితిలో ‘పోలీస్ స్టోరీ’ సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. కన్నడలో పెద్ద స్టార్ హీరోను చేసింది. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సాయికుమార్ పేరు సౌత్ ఇండియా అంతటా మార్మోగిపోయేలా చేసింది. ఆ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాటి అనుభవాల్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు సాయికుమార్.
‘‘పోలీస్ స్టోరీ విడుదలకు ముందు రోజు చాలా టెన్షన్ గా అనిపించింది. దీంతో మరుసటి రోజు చెన్నై వెళ్లిపోయాను. అక్కడి నుంచి టాక్ తెలుసుకుందాం అనుకున్నాను. విడుదల రోజు నా మిత్రుడు ఫోన్ చేసి సినిమాకు హిట్ టాక్ వచ్చిందని.. సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూసే థ్రిల్ మిస్సయ్యావని అన్నాడు. ఏంటోలే అనుకున్నా. ఆ రోజు సాయంత్రానికి బెంగళూరుకు నా ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. మందిర థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డు కనిపించింది. అప్పటికి నాకు నమ్మకం కుదిరింది. పోలీస్ స్టోరీ తెలుగు వెర్షన్ రిలీజైనపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చిరంజీవి గారు ఈ సినిమా గురించి మాట్లాడాక జనాలకు తెలిసింది. ఆ తర్వాత ఈ సినిమా 200 రోజులు ఆడింది. మలయాళం.. హిందీలో కూడా ‘పోలీస్ స్టోరీ’ సూపర్ హిట్టయింది. ఆ రోజుల్లో ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో.. కేవలం 28 రోజుల్లో పూర్తి చేశాం. సినిమాలో టెంపో మిస్ కాకూడదని నిర్విరామంగా షూటింగ్ చేశాం’’ అని సాయికుమార్ గుర్తు చేసుకున్నారు.