‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ చాలా పనులు చేస్తాడట. అవి చాలా హీరోయిగ్ గా.. ఫ్యాన్సీగా ఉంటాయట. కానీ ఆ పనులేంటన్నది తెరమీదే చూడమంటున్నాడు డైలాగ్ కింగ్ సాయికుమార్. ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక సందర్భంగా ఎన్టీఆర్ ఎలాంటి డైలాగ్ చెప్పలేదు. ఇంకెవరూ కూడా సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళ్లలేదు. కానీ సాయికుమార్ మాత్రం ఇందులోని ఓ డైలాగ్ చెప్పి.. సినిమా మీద ఆసక్తి పెంచాడు. ‘‘కుర్రోడివి.. బాగా చదువుకున్నోడివి.. ఇలాంటి పనులు చేయకూడదనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా? చేస్తున్నపుడు చాలా ఫ్యాన్సీగా హీరోయిగ్ గానే ఉంటుంది. ఇలాంటి పనులు చేసే అధికారం కానీ.. హక్కు గానీ నీకు లేదు’’ అంటూ సినిమాలో తాను ఎన్టీఆర్ ను ఉద్దేశించి చెప్పే డైలాగ్ అభిమానులతో పంచుకున్నాడు సాయికుమార్. ఎన్టీఆర్ చేసే పనులేంటన్నది తెరమీదే చూడమన్నారు ఆయన.
ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘1974లో పెద్దాయన ఎన్టీఆర్ సినిమాతో డబ్బింగ్ కళాకారుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆయన కాలి దగ్గర కూర్చుని ఆయన డైలాగ్ ఒకటి చెబితే ఆశీర్వదించారు. అదే ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఆ తర్వాత బాలయ్యతో ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ చేశాను. కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ చేశాను. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’. ఎన్టీఆర్ తానా వేడుకల సందర్భంగా ఇచ్చిన తొలి నృత్య ప్రదర్శన ఇచ్చినపుడు నేను అక్కడే శ్రీకృష్ణుడి పాత్ర చేశాను. జనతా గ్యారేజ్ లాంటి గొప్ప సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది’’ అని సాయికుమార్ చెప్పాడు.