జాతీయ అవార్డు ఆశిస్తున్న మన సీనియర్

Update: 2015-07-27 09:54 GMT
నటుడిగా తన దాహం తీర్చే స్థాయి పాత్రలు చేయలేదన్న అసంతృప్తి ఉందంటూ ఈ మధ్య ఆవేదన వ్యక్తం చేశారు సాయికుమార్. ఐతే గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి బెటరే అంటున్నారు డైలాగ్ కింగ్. పండగ చేస్కో సినిమాలో చేసిన పాత్ర చాలా ఆనందాన్నిచ్చిందని.. మరోవైపు కన్నడలో అద్భుతమైన పాత్రలు చేస్తున్నానని చెప్పారు సాయికుమార్. రంగి తరంగ అనే సినిమాలో తాను పోషించిన పోస్ట్ మాస్టర్ పాత్ర నటుడిగా తనకో మైలురాయి లాంటిదని.. వినడానికి అతిగా అనిపించినా ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాని సాయికుమార్ చెప్పారు.

పరిశ్రమ తనలోని నటుణ్ని సరిగా వాడుకోలేదనే ఫీలింగ్ ఉన్న మాట వాస్తవమే అని సాయికుమార్ చెప్పారు. ‘‘అవును. ఆ ఫీలింగ్ నాకుంది. నటుడిగా నాకింగా సంతృప్తి లభించలేదు. నా అదృష్టం ఏంటంటే తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నా కాబట్టి నా ఎనర్జీ లెవెల్స్ తగ్గట్లేదు. బిజీగా ఉంటున్నా కాబట్టి డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో కూడా సినిమా చేయబోతున్నా. నాకు ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది. వాస్తవానికి హీరోగా నేను పెద్ద డైరెక్టర్లతో చేయలేదు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడూ పెద్ద సినిమాలు చేస్తున్నాను. ఏం చేసినా కమర్షియల్ గా బాగా సక్సెస్ అయ్యే సినిమా చేయడం ముఖ్యం. అప్పుడే బ్రేక్ వస్తుంది. అలాంటి పెద్ద బ్రేక్ కోసమే చూస్తున్నా’’ అన్నారు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకు తాను పదికి తొమ్మిది మార్కులేసుకుంటానని.. నటుడిగా మాత్రం ఏడు మార్కులే వేసుకుంటానని సాయికుమార్ చెప్పారు.
Tags:    

Similar News