ఒక్క కలంతో మూడు చరిత్రలు

Update: 2017-10-27 05:14 GMT
సినిమాకి ఒక కథ ఒక బలం అయితే మరో బలం సినిమాలో మాటలని చెప్పాలి. చెప్పాలంటే ఈ రోజుల్లో స్టార్  రైటర్స్ కొద్దిమందే ఉన్నారు. వారి కోసం అగ్ర దర్శకులు వెయిట్ కూడా చేస్తున్నారు. కొంత మంది రచయితలు ఇప్పుడు దర్శకుడి గాను మారిపోతున్నాడు. సినిమా సక్సెస్ - ఫెయిల్యూర్ తో వారికి సంబంధమే ఉండదు. వారు రాసిన ఒక్క డైలాగ్ హిట్ అయతే చాలు ఆటోమేటిక్ గా ఇమేజ్ వస్తోంది. ముఖ్యంగా మాస్ తరహా భారీ బడ్జెట్ సినిమాలకైతే మాటల రచయితల అవసరం తప్పని సరిగా ఉంటోంది.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైలాగ్స్ రైటర్ గా ఉన్న వారిలో సాయి మాధవ్ బుర్ర ఒకరు. క్రిష్  తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో పరిచయం అయిన ఈ రైటర్ కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కంచె - గోపాల గోపాల సినిమాల్లో రాసిన డైలాగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక చిరంజీవి ఖైదీ నెంబర్ 150 - గౌతమి పుత్ర శతకర్ణి సినిమాలు హిట్ అవ్వడంతో సాయి మాధవ్ స్టార్ రైటర్ గా మారిపోయారు.

ప్రస్తుతం ఆయన చేతిలో మరికొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు కూడా ఉన్నాయి. చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ సైరా నరసింహా రెడ్డి అలాగే బాలకృష్ణ తీయనున్న ఎన్టీఆర్ బయోపిక్ కి కూడా తన కలం బలాన్ని అందిస్తున్నాడు. అదే విధంగా మహానటి సావిత్రి బయోపిక్ సినిమాకి కూడా సాయి మాధవ్ మాటలను అందిస్తున్నాడు. ఈ రైటర్ చేతిలో ఉన్న ఈ మూడు చిత్రాలు చరిత్రాత్మక అంశలతో తెరకెక్కుతున్నవే. మరి ఒక్క కలం తో ఆ చరిత్రలకు సరిపడే మాటలను ఏ విధంగా అందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News