పెళ్లిపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. అందుకు కారణాలు అనేకం..వ్యక్తిగతంగానే భావించాలి. తల్లిదండ్రుల ఆలనా పాలనలో పెరిగి ఒక్కసారిగా ఆ ఆప్యాయతల నుంచి వేరు అవ్వాలంటే? ఏ అమ్మాయి అయినా బాధ పడటం సహజం. అత్తారింట్లో కాలు పెట్టి కొన్ని రోజులు గడిచే వరకూ తల్లి ప్రేమ వెంటాడుతుంటుంది. ఆ తర్వాత కాలక్రమంలో అన్ని కనుమరుగైపోతుంటాయి.
నీకంటూ ఓ జీవితం ఏర్పాటవుతుంది. భర్త..పిల్లలు..సంసారం చదరంగంలో పడి అమ్మ ప్రేమకి దూరమవుతుంటారు. ఆ ప్రేమకి దూరం కాకూడదనుకున్న వారంతా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనే ఆశపడుతారు. అందులో 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి కూడా ఒకరు. డాక్టర్ చదివిన బ్యూటీ జీవితంలో పెళ్లిచేసుకోనని కరాకండీగా చెప్పేసింది ఓసందర్భంలో.
పెళ్లిలో ఏముంటుంది? మన జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు? ఆ కారణంగా కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోవాలా? అని బలమైన లాజిక్ వెదిక్కింది. తల్లి సెంటిమెంట్ ఎవరేసినా అక్కడ మాట్లాడటానికి మరో మాట ఉండదు. అలాంటి సన్నివేశమే 'ఫిదా' ప్రచార సమయంలో మీడియాకి ఎదురైంది. ప్రతినిధులు ముక్కున వేలేసుకోవడం తప్ప చేసిందేం లేదు.
ఇంత బలంగా చెబుతుందంటే? నిజంగానే పెళ్లి చేసుకునేలా లేదని దాదాపు అంతా ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయితే అమ్మడు తాజాగా ప్లేట్ ఫిరాయించింది. పెళ్లి చేసుకోను అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తాజా ప్రకటనతో తెలుస్తోంది. 'విరాట పర్వం' ప్రచారం లో భాగంగా పెళ్లిపై తనలో పాజిటివ్ యాంగిల్ని బయట పెట్టింది.
ఇంట్లో సాయి పల్లవి తెలుగు మాట్లాడుతుంటే? ఎంచక్కా తెలుగు అబ్బాయినే చూసి చేసుకోవచ్చుగా అని పేరెంట్స్ సలహా ఇచ్చారుట. అందుకు తాను ఒకే చెప్పిందిట. తప్పకుండా మీ మాట ప్రకారమే కానిచేస్తానని నవ్వేసింది. ఇది వినడానికి జోక్ లా ఉన్నా.. పెళ్లిపై మాత్రం స్ర్టాంగ్ గానే ఉందని అర్ధమైంది. తప్పకుండా పెళ్లిచేసుకుంటానని.. కానీ అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేనని తెలిపింది.
దీన్ని బట్టి సాయిపల్లవి పెళ్లి విషయలో ఎలాంటి టర్న్ తీసుకుందో అర్ధమవుతోందిగా. పెళ్లి అనే బంధం గురించి తెలుసుకో వడానికి పల్లవికి ఐదేళ్లు సమయం పట్టిందన్న మాట. ఈ మార్పు కాలం తెచ్చిందా? పాపాయి గా భావించే అమ్మనాన్నలు తీసుకొచ్చారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం నటిగా సాయి పల్లవి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. ఇటీవలే డాక్టర్ కోర్స్ కూడా పూర్తిచేసింది. అవకాశాలొచ్చినంత కాలం సినిమాలు కంటున్యూ చేస్తుంది. ఆ తర్వాత చేతికొచ్చి డాక్టర్ పట్టాతో క్లినిక్ ఓపెన్ చేస్తుంది. ఈ మధ్యలో వివాహ బంధంతో ఓ ఇంటిదైనా అవ్వొచ్చు.