ఎగ‌బ‌డి ఇస్తుంటే.. ఎందుకు వ‌ద్దంటారు?

Update: 2018-02-12 08:37 GMT
సినిమా హిట్టు - ఫ్లాపుతో సంబంధం హీరోయిన్ల‌కు సంబంధ‌మే లేన‌ట్టుంది. ఒక్క హిట్టు లేక‌పోయినా... రెమ్యున‌రేష‌న్‌ లో మాత్రం ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. స‌రిక‌దా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ తీసుకుంటున్న కుర్ర హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

తెలుగులో మొద‌టి సినిమానే అట్ట‌ర్ ఫ్లాప్ అయింది పూజా హెగ్డేకు. దాంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్క‌డ అదే ప‌రిస్థితి. తిరిగి దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా కోసం టాలీవుడ్‌కు వ‌చ్చింది. ఆ సినిమా హిట్టు కొట్టింది. కానీ అందులో అమ్మ‌డిది కేవ‌లం గ్లామ‌ర్ డాల్ పాత్ర‌. సినిమాను న‌డింపిందంతా డీజేనే అదేనండీ అల్లు అర్జునే. ఆ సినిమా త‌రువాత అవ‌కాశాలు బాగానే వ‌స్తున్నాయ్ అమ్మ‌డికి. అందుకేనేమో రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ ప‌క్క‌న సాక్ష్యం సినిమాలో చేయ‌డానికి అక్ష‌రాలా కోటిన్న‌ర డిమాండ్ చేసింద‌ట‌. నిర్మాత‌లు కూడా లేద‌న‌కుండా ఇచ్చేశార‌ట‌.

నిజానికి కుర్ర హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వికే మంచి హిట్స్ ఉన్నాయి. ఫిదా - ఎంసీఏ బాగా ఆడాయి. అయినా సాయి ప‌ల్ల‌వి సినిమాకు కోటి రూపాయ‌లు తీసుకుంటోంది. డీజే త‌ప్ప చెప్పుకోవ‌డానికి అస‌లు సినిమాలే లేని పూజా మాత్రం కోటిన్న‌ర డిమాండ్ చేస్తోంది. అప్ప‌ట్లో క‌త్రినాకైఫ్ తెలుగులో వెంక‌టేష్ తో - బాల‌య్య‌తో న‌టించింది. ఆమె కూడా ఎంత‌డిగితే అంత ఇచ్చ‌శారు మ‌న నిర్మాత‌లు. ఆ త‌రువాత కాజ‌ల్‌ - ఇలియానా - స‌మంత అలా గే  డిమాండ్ చేశారు... అందుకున్నారు కూడా. అయితే వీరిలో స‌మంత‌నే సినిమాను త‌న భుజాల‌పై మోసే స‌త్తా ఉన్న హీరోయిన్‌. మిగ‌తావారంద‌రూ ఉత్త గ్లామ‌ర్ డాల్సే. 
Tags:    

Similar News