స్క్రీన్ పై రొమాన్స్.. బైట అన్న అనే పిలుపు!

Update: 2018-12-19 09:16 GMT
'ఫిదా'లో భానుమతి పాత్ర తో హైబ్రిడ్ పిల్లగా తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేసినా సాయి పల్లవి రూటే సెపరేటు.  మిగతా హీరోయిన్ల కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటుంది. నటన.. డ్యాన్స్ లలో దుమ్ము లేపే సాయిపల్లవి తన యాటిట్యూడ్ తో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన తో పనిచేసే హీరోలను డామినేట్ చేస్తుందనే రూమర్లు కూడా ఉన్నాయి. తాజాగా మరో విషయంలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

శర్వానంద్ హీరో గా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 21 న రిలీజ్ కానుంది. సినిమా ప్రోమోలలో శర్వా - సాయిపల్లవి ల మధ్య ఉండే కెమిస్ట్రీ బాగుందనే ప్రశంసలు అందుకున్నారు.  ఇదిలా ఉంటే.. సాయి పల్లవి హీరో శర్వాను సినిమాలో రొమాన్స్ చేసినా సెట్స్ లో మాత్రం 'అన్నా' అనే పిలిచేదట.  సాయి పల్లవి ఏ సినిమా చేసినా తన కు క్లోజ్ గా ఉండే వారిని ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తుందట. అందుకే ఏదో ఒక రిలేషన్  తో  పిలుస్తుందట. ఇక్కడ శర్వా 'అన్న' అయ్యాడు అంతే.  

'ఫిదా' సినిమాలో తండ్రి పాత్ర పోషించిన సాయి చాంద్ ను నిజంగా నే నాన్నలాగా ట్రీట్ చేస్తూ 'నాన్న' అనే పిలుస్తానని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఏంటో.. ఈ హైబ్రిడ్ పిల్లవి అన్నీ హైబ్రిడ్ థియరీలే.
Tags:    

Similar News