'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి టాలీవుడ్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హిట్ తోనే అమ్మడు యువత మనస్సుల్ని కొల్లగొట్టింది. చెన్నై గాళ్ అయినా తెలుగు పిల్లగా ఫేమస్ అయిపోయింది. అందం..అభినయంతో పాటు.. ట్యాలెంట్ అనే స్కిల్ అమ్మడిని అగ్ర పథాన నిలబెట్టింది. నటిని మించి గొప్ప డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది.
ఆ ఒక్క స్కిల్ తోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ స్టార్ తోనే ప్రశంసలందుకుంది. స్టైలిష్ స్టార్ బన్నీ సైతం తనతో ఒక్కసారైనా పోటీకి దిగాలని ఉందని ఆశపడ్డాడు. అవకాశాలు ఆమెను వెదుక్కుంటూ రావాలే తప్ప..వాటిని వెదుక్కుంటూ వెళ్లదు. నటిగా తనకంటూ కొన్ని పరిమితులు విధించుకుని కెరీర్ ని సాగిస్తుంది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా తనలో ఆ స్కిల్స్ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టాయి. కాగా నేడు ఆమె జన్మదినోత్సవం సందర్భంగా సాయి పల్లవి గురించి ప్రత్యేక కథనం...
సాయి పల్లవి పుట్టి పెరిగింది చెన్నైలోనే. 2005లో 'కస్తూరి మాన్' అనే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై 'ధూమ్ ధామ్' అనే మరో సినిమాలో నటించింది. ఆ రెండు సినిమాలు సాయి పల్లవికి టైంపాస్ మూవీస్ లాంటివే. కొంత గ్యాప్ అనంతరం 2015 లో 'ప్రేమమ్' సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది.
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలో చాలా మంది హీరోయిన్లు నటించినా సాయి పల్లవి పాత్రకి ప్రత్యేయమైన గుర్తింపు దక్కింది. తనలో నేచురల్ పెర్పార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. తనలో ఆ ప్రతిభ చూసే తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కించిన 'ఫిదా'లో హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలంగాణ పిల్ల యాసభాషలో ఆకట్టుకుంది. తొలి సినిమానే కమర్శియల్ సక్సెస్ తో పాటు..నటిగాను పేరు దక్కించుకుంది. ఆ సినిమాలో హీరో పాత్రని సైతం సాయి పల్లవి డామినేట్ చేసింది.
తనలో డాన్సింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసింది. ఆప్రతిభను గుర్తించే మరోసారి శేఖర్ కమ్ములా 'లవ్ స్టోరీ'లో హీరోయిన్ గా ఎంపిక చేసారు. కమ్ములా తెలివిగా సాయిపల్లవిలో డాన్సింగ్ ట్యాలెంట్ ని వాడుకోగలిగారు. ఆ సినిమా సక్సెస్ లో పల్లవి మరోసారి కీలక పాత్ర పోషించింది. ఇలా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో టాలీవుడ్ లో క్రేజీ కలయికగా పేరు దక్కిచుకుంది.
ఇక 'ఫిదా' తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' లో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇలా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉంది. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినప్పటికీ ఆవేమి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. తమిళ్...మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం రానా సరసన 'విరాట పర్వం'లో నటిస్తోంది. రాష్ర్ట స్థాయిలో తమిళ్..మలయాళం..తెలుగులో అవార్డులు సైతం అందుకుంది.