సాయి ప‌ల్ల‌వి వ్యాఖ్య‌ల‌పై నెట్టింట వివాదం

Update: 2022-06-15 09:55 GMT
రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ 'విరాట ప‌ర్వం'. ఏడాది కాలంగా రిలీజ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు జూన్ 17న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో వివిధ మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ప్ర‌మోష‌న్స్ లో షుషారుగా పాల్గొంటోంది సాయిప‌ల్ల‌వి. గ‌త వారం రోజులుగా హైద‌రాబాద్ లో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం కేటాయించి హ‌డావిడి చేస్తోంది.

ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. తాను దైవాన్ని నమ్ముతాన‌ని, త‌న‌కు దైవ చింత‌న ఎక్కువ‌ని స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా ఇంట్లో వాతావ‌ర‌ణం ఎలా వుంటుందో వివ‌రించింది. ఇక ఎవ‌రు ఏ ప‌ని చేసినా స‌రే మంచి మ‌నిషిలా బ‌త‌కాల‌ని, చేసే ప‌నిలో మంచి ఉండాల‌ని న‌మ్ముతామ‌ని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే ఓ మీడియా కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌శ్మీర్ పండిట్ల మార‌ణ హోమం.. గో హ‌త్య‌ల‌కు ఉన్న సంబందం గురించి మాట్లాడింది. ఇదే ఇప్పుడు వివ‌వాదంగా మారుతోంది.  

'విరాట‌ప‌ర్వం' న‌క్స‌ల్స్ ఉద్య‌మం నేప‌థ్యంలో రూపొందింది. ఈ సంద‌ర్భంగా న‌క్స‌ల్స్ గురించి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌నకు తెలియ‌కుండానే క‌శ్మీర్ ఫైల్స్ , గోహ‌త్య‌పైకూడా స్పందించింది. న‌క్స‌ల్స్ ఉద్య‌మం గురించి మాట్లాడుతూ ' వాళ్ల‌ది ఒక ఐడియాల‌జీ..మ‌న‌కు శాంతి అనేది ఒక ఐడియాల‌జీ. నాకు వ‌యెలెన్స్ అనేది న‌చ్చ‌దు.. త‌ప్పుగా అనిపిస్తుంది. వ‌యిలెంట్ గా వుండి మ‌నం సాధించ‌గ‌ల‌మ‌ని నేను న‌మ్మ‌ను. వాళ్ల టైమ్ లో ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలి. మా క‌ష్టాల‌ని ఎవ‌రు వింటారు.. లా అనేది వుంటే ఇది క‌రెక్ట్ ఇది త‌ప్పు అని చూడాలి. అని ఎవ‌రికీ తెలియ‌దు. ఎక్క‌డికి వెళ్లాలి.. ఏం చేయాలో తెలియ‌దు. అందుకే వారంతా ఓ గ్రూపుగా మారారు. అయితే వాళ్లు చేసింది త‌ప్పా రైటా అని మ‌నం చెప్పే కాలంటో లేం.

అలా చూస్తే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ల‌కి మ‌న జవాన్లు టెర్రిస్ట్ ల‌లా క‌నిపిస్తారు. ఎందుకంటే మ‌నం హార్మ్ చేస్తామ‌నుకుంటారు కాబ‌ట్టి. మ‌న‌కు వాళ్లు అలానే క‌నిపిస్తారు. ప‌ర్ స్పెక్టీవ్ మారిపోతుంది. నాకు వ‌య‌లెన్స్ అనేది న‌చ్చ‌దు. అర్థం కాద‌వు. ఏది త‌ప్పు ఏది రూట్ అని చెప్ప‌డం క‌ష్టం. ఆ కాలంలో వాళ్లు చేశారు. అలా చేస్తే నే మాకు న్యాయం దొరుకుతుంద‌ని అనుకున్నారు. మా ఫ్యామిలీ లెఫ్ట్ రైట్ అని ఉండ‌దు. న్యూట్ర‌ల్ గా వుండే ఫ్యామిలీలో పెరిగాను. అందులో ఎవ‌రు రైట్ , ఎవ‌రు రాంగ్ అని చెప్ప‌లేను. మ‌నం మంచి మ‌నుషుల్లా ఉండాలి. ఎవ‌రో ఎవ‌రినో హ‌ర్ట్ చేస్తున్నార‌ని మ‌నం కూడా చేయ‌కూడ‌దు. బాధితుల గురించి ఆలోచించాలి.

కొన్ని రోజుల క్రితం 'ది క‌శ్మీర్ ఫైల్స్‌' అనే సినిమా వ‌చ్చింది క‌దా? .. ఆ టైమ్ లో ఉన్న క‌శ్మీరీ పండిట్ల‌ను ఎలా చంపారో చూపించారు క‌దా? .. మ‌నం మ‌త ఘ‌ర్ష‌ణ‌లా వాటిని చూస్తే.. రీసెంట్ గా ఓ బండిలో ఆవుల‌ని తీసుకెళ్లున్నార‌ని, ఆ వెహికిల్ ని న‌డుపుతున్న వ్య‌క్తి ముస్లీం అని కొంత మంది కొట్టి జై శ్రీ‌రామ్ అన్నారు. అప్పుడు జ‌రిగిన దానికి ఇప్పుడు జ‌రిగిన తేడా ఎక్క‌డ వుంది.. మ‌తాలు కాదు మ‌నం మంచి వ్య‌క్తిగా వుంటే ఇత‌రుల‌ను బాధించం.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా  మ‌నం మంచిగా వుండ‌క‌పోతే న్యాయం ఎక్క‌డా ఉండ‌దు' అని తెలిపింది సాయి ప‌ల్ల‌వి.  

ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు సోష‌ల్ మీడియా వేదిక‌గా వివాదం అవుతున్నాయి. నెట్టింట పెద్ద దుమార‌మే రేగుతోంది. కొంత మంది నెటిజ‌న్స్ సాయి ప‌ల్ల‌విపై విరుచుకుప‌డుతున్నారు. త‌న సినిమాని బ్యాన్ చేస్తామంటూ కామెంట్ లు చేస్తున్నారు. మ‌రి కొంత మంది మాత్రం ఆమెకు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఆమె వ్యాఖ్య‌ల్ని స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి పెను ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తే మాత్రం రాజ‌కీయ రంగు పులుముకోవ‌డం ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు.

Tags:    

Similar News