భానుమతి అంటున్నారు.. అదో భాద్యత

Update: 2018-12-24 01:30 GMT
టాలీవుడ్లో హీరోయిన్లు చాలామందే ఉన్నారుగానీ అందం.. నటన.. డ్యాన్స్ ఇలా అన్నీ విషయాల్లో డిస్టింక్షన్ తెచ్చుకునే హీరోయిన్ మాత్రం సాయిపల్లవి మాత్రమే.  సాయి పల్లవి శర్వానంద్ తో కలిసి నటించిన 'పడి పడి లేచే మనసు' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ శర్వానంద్.. సాయి పల్లవిల నటనకు వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి.

తాజా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.  నటనలో హీరోలను డామినేట్ చేస్తున్నారని అనుకుంటున్నారని అడిగితే.. ప్రేక్షకులకు అలా అనిపిస్తుందేమోగానీ అలాంటి విషయాలగురించి ఏమాత్రం ఆలోచించనని తెలిపింది.  తన పాత్రకు ఎలా 100% జస్టిస్ చేయాలని మాత్రం అలోచిస్తానని చెప్పింది.  ఇక శర్వా గురించి మాట్లాడుతూ శర్వా మంచి సహనటుడని కితాబిచ్చింది.  శర్వా చక్కగా మాట్లాడతాడని అసలు ఈగో లేదని..  ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పింది. దర్శకుడు హను రాఘవపూడి మంచి హార్డ్ వర్కర్ అని ఎపుడు సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పింది.  

ఎప్పుడైనా బయట కనిపిస్తే చాలామంది ప్రేక్షకులు తనను భానుమతి అని పిలుస్తున్నారని. వారు ఆ పాత్రను ఎంతో ప్రేమించారు కాబట్టే తనను అలా గుర్తు పెట్టుకున్నారని చెప్పింది.. అదో భాద్యత లాగా భావించి ప్రాముఖ్యత ఉండే పాత్రలు ఎంచుకుంటున్నానని చెప్పింది.  షూటింగ్ కు సమయానికి రానని అంటున్నారని..కానీ అది నిజంకాదని.. టైమ్ కు సెట్ లో ఉంటానని తెలిపింది. హిట్లు.. ఫ్లాపులు పెద్దగా పట్టించుకోనని తనవైపు నుండి ప్రయత్నలోపం ఉండకూడదని మాత్రమే అనుకుంటానని చెప్పింది.  

తనను తాను ఎప్పుడూ హీరోయిన్ గా ఫీలవ్వదట. ఒక సాధారణ అమ్మాయిలాగానే ఉంటుందని. ఫ్యామిలీ మెంబర్స్.. ఫ్రెండ్స్.. రిలేటివ్స్ కూడా తనను హీరోయిన్ గా ట్రీట్ చేయరని చెప్పింది. ఇంట్లో తన పనులు తనే చేసుకుంటుందట.  వేణు ఉడుగుల దర్శకత్వంలో ఒక సినిమాకు చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా సైన్ చేయలేదని తెలిపింది. కానీ బయట వార్తలు వచ్చినట్టు అది నక్సలైట్ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చింది.  
    

Tags:    

Similar News