మొదటి సినిమా ఫిదాతో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొంది.. రెండో సినిమా ఎంసీఏతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి ఎంటరైపోయింది ట్రెడిషనల్ బ్యూటీ సాయి పల్లవి. కెరీర్ తొలి రోజుల్లోనే బోలెడన్ని ప్రశంసలు.. అదే స్థాయిలో విమర్శలు దక్కించుకున్న హీరోయిన్ ఆమేనని చెప్పాలి. ఫేమస్ హీరోయిన్ అయినా కూడా చాలా సింపుల్ గా.. నార్మల్ గా ఉండటం మాత్రం ఓరకంగా సాయి పల్లవికే సాధ్యమని చెప్పాలి.
రీసెంట్ గా సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన కణం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ మూవీకి.. ఈ ఈవెంట్ కు కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ సాయిపల్లవియే. కానీ ఆమె బయలుదేరబోయే సమయానికి విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కారులో బయలుదేరి వస్తే ఈవెంట్ కు సమయానికి రావడం అనేది కుదరని పని. దాంతో చక్కగా తన అసిస్టెంట్ బైక్ ఎక్కి వెనుక కూర్చుని చాలా మామూలుగా ఈవెంట్ జరిగే ప్లేసుకు వచ్చేసింది. కారు లేకుండా కారు బయటపెట్టలేం అన్న బిల్డప్ లేకుండా అనుకున్న సమయానికి మామూలు అమ్మాయిలా వచ్చేసిన ఆమె సింప్లిసిటీకి ఈవెంట్ కు వచ్చిన వారినుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
కణం తమిళంలో కరు పేరుతో రిలీజవనుంది. అభినేత్రి ఫేం ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ లతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ చిత్రమైన 2.0 తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే కణం సినిమా కూడా తెరకెక్కింది.