ప్రేమమ్ లో మలార్ గా నటించిన సాయి పల్లవికి సౌత్ అంతా ఫుల్లు క్రేజ్ వచ్చేసింది. అమ్మడు అందంతో పాటు యాక్టింగ్ తో కూడా ఇరగదీసేసింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ భామ మెగా హీరో వరుణ్ తేజ్- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రూపొందుతున్న ఫిదా మూవీతో అరంగేట్రం చేసేస్తోంది. జేఎఫ్ డబ్ల్యూ యానివర్సరీ సందర్భంగా.. ఆ మేగజైన్ కవర్ పేజ్ గాళ్ గా కనిపించింది సాయి పల్లవి.
కుర్చీలో కుదురుగా కూర్చుని.. ఓ చేతిని నుదుటికి దగ్గరగా పెట్టుకుని.. ఓరకంటితో చూస్తున్న ఆ ఒక్క లుక్ చాలు.. కుర్రాళ్లు అలా పడిపోయి అక్కడే ఉండిపోవడానికి. అమ్మడి కళ్లలో అంత మాయ ఉంటుంది మరి. ఇంతగా తన అందం మెరిసిపోవడానికి.. తన హెయిర్ కూడా రీజన్ అంటుంది సాయి పల్లవి. రోజూ ఉదయాన్నే ప్రేయర్ చేసేసే ఈ భామ.. ప్రతీ మూడ్రోజులకు హెయిర్ వాష్ చేసి.. దేవుడా నా జుట్టు రాలిపోకుండా చూడమని కోరుకుంటుందట. ఇక యాక్టింగ్ కావాలా మెడిసిన్ కావాలా అంటే మాత్రం మెడిసిన్ నే సెలక్ట్ చేసుకుంటానని చెబుతోంది.
అమ్మడి ఫేవరేట్ యాక్టర్ ఎవరో తెలుసా.. 'ఐ లవ్ సూర్య.. యాక్ట్ చేస్తానో లేదో తెలీదు కానీ.. సూర్యని ఒక్కసారైనా కలవాలి.. ఐ లవ్ యు సూర్య' అనేస్తున్న సాయిపల్లవి.. ప్రేమమ్ తర్వాత బోలెడన్ని ఆఫర్లు వచ్చాయంటోంది. ఈ భామకి షాపింగ్ అంటే ఇష్టమట. చిన్నప్పుడు మహా డేంజర్ గా ఉండేదాన్నని తనే చెబుతూ.. చూసేందుకు అమాయకంగా కనిపించినా.. లోపల మాత్రం వేరే కేరక్టర్ మనది అంటోంది. 'ఐ లవ్ షాపింగ్.. పొద్దున్నే తొమ్మిదింటికే రెడీ అయిపోయి.. షాపుల వాళ్లు షట్టర్లు తీసే టైముకి బైట వెయిటింగ్ చేసేస్తూ ఉంటా' అంటూ నవ్వేస్తోంది.