సాయి పల్లవిని రుద్దేస్తున్నారు!!

Update: 2017-07-30 06:29 GMT
మన దగ్గర ఇదే ఒక బ్యాడ్ హ్యాబిట్. ఒక పరాయి రాష్ట్రం హీరో లేదా హీరోయిన్ సినిమా ఒకటి హిట్టయ్యిందంటే చాలు.. వెంటనే వారి ఇతర సినిమాలను కూడా మనమీద రుద్దేస్తారు. అది ఎంతగా అంటే.. ఇక్కడే ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమాలను పెద్దగా పట్టించుకోరు కాని.. అక్కడ ఫ్లాపైన సినిమాలను కూడా భారీ హంగులతో దించుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్లాప్ కాదులేకాని.. హిట్టయిన ఒక సినిమాను తెలుగులో అదే విధంగా తెస్తున్నారు.

మలయాళం సినిమాల్లో చెప్పుకోదగిన ఒక విషయం ఏంటంటే.. కథలపరంగా ఏవో కొత్తపుంతలు తొక్కుతూ ఉంటారు. అక్కడ ప్రేమమ్ సినిమా హిట్టవ్వగానే సాయిపల్లవి చేసిన రెండో సినిమా 'కాళీ'. ఈ సినిమాలో హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక జీవితంలో ఎలా ఇబ్బందులు పడ్డాడు అనేదే కథ. అదిగో మన దగ్గర ఈ సినిమా ప్రేరణతోనే 'అర్జున్ రెడ్డి' సినిమా వస్తున్నట్లుంది. ఇన్నాళ్ళూ ఈ కాళీ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు కాని.. ఇప్పుడు సాయిపల్లవికి ఫిదా సినిమాతో బాగా పేరు వచ్చేయడంతో.. మనోళ్లు వెంటనే ఆ సినిమాను డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈమెను జనాల మీద రుద్దడం మొదలెట్టేస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే.. కొన్ని సినిమాలను ఒరిజినల్ తో పాటు రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. కాళీ సినిమాను కూడా అప్పట్లో అలా రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తే అసలు మనోళ్లు పట్టించుకోలేదేట. ఇప్పుడు మాత్రం కావాలని ఎగబడుతున్నారు. ఏమిసేతురా లింగా!!
Tags:    

Similar News